- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం వివాదం
కేరళ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం వివాదం నెలకొంది. అసెంబ్లీలో వందేమాతరంను పూర్తిస్థాయిలో పాడలేదని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: కేరళ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం వివాదం నెలకొంది. అసెంబ్లీలో వందేమాతరంను పూర్తిస్థాయిలో పాడలేదని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆరోపించారు. ఈ అంశాన్ని ఆయన కేరళ అసెంబ్లీ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాలను పాటించలేదని అభిప్రాయపడ్డారు. అయితే ఇది కొత్త విషయం కాదని కేరళ ప్రభుత్వం చెబుతోంది. అసెంబ్లీలో ఎప్పటి నుండో రెండు చరణాలనే ఆలపిస్తున్నారని, ఆ సంప్రదాయమే ఇప్పుడు కూడా కొనసాగుతోందని పేర్కొంది.
ఇదిలా ఉంటే అసెంబ్లీ సమవేశాల మొదటిరోజు గవర్నర్ సభకు వస్తుంటే పోలీస్ బ్యాండ్ వందేమాతరం గేయాన్ని మొత్తం కాకుండా కేవలం రెండు చరణాలను మాత్రమే ట్యూన్ రూపంలో వినిపించారు. కానీ నిజానికి కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం.. గవర్నర్ హాజరయ్యే అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించాలి. కానీ కొత్తగా ఏర్పడిన యూడీఎఫ్ ప్రభుత్వం ఆ ఆదేశాలు పక్కన పెట్టి ఎప్పటి నుండో వస్తున్న సంప్రదాయం ప్రకారం చరణాలు మాత్రమే ప్లే చేయడం వివాదానికి దారితీసింది.






