- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vande Mataram: జనగణమన కంటే ముందు వందేమాతరం తప్పనిసరి.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
వందేమాతరం విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శాలు విడుదల చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ గేయం వందేమాతరం (Vande Mataram) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, విద్యా సంస్థల్లో జాతీయ గీతం 'జనగణమన' (Jana Gana Mana) కంటే ముందు జాతీయ గేయం 'వందేమాతరం' ను ఆలపించడాన్ని తప్పనిసరిగా చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే 1937లో కాంగ్రెస్ తొలగించిన నాలుగు చరణాలను సైతం కలిపి మొత్తం ఆరు చరణాలతో 3 నిమిషాల 10 సెకన్ల నిడివి కలిగిన వందేమాతరం గేయాన్ని ఆలపించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు ఇవాళ్టి నుంచే అమల్లోకి తీసుకువచ్చింది. కేంద్రం నూతన మార్గదర్శకాల ప్రకారం పౌర పురస్కారాలు ప్రదానం చేసే కార్యక్రమాలు, రాష్ట్రపతి, గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాలతో పాటు అన్ని అధికారిక కేంద్ర, రాష్ట్ర కార్యక్రమాలు, విద్యా సంస్థల్లో వందేమాతరం ఆలపించడం తప్పని సరి చేసింది. సినిమా హాల్స్ వంటి బహిరంగ ప్రదేశాల్లో కూడా దీనిని తప్పనిసరి చేసినప్పటికీ సినిమా హాల్స్ లో మాత్రం ఈ గేయం ఆలపిస్తున్న సమయంలో నిలబడటం నుంచి మినహాయింపు ఇచ్చింది.
పాటించని వారికి మూడేళ్లు జైలు శిక్ష:
వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నూతన మార్గదర్శకాలను కేంద్రం (Central Government Guidelines) తీసుకువచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం దేశ గౌరవానికి చిహ్నాలైన జాతీయ గీతం, జాతీయ గేయం ఆలాపన జరుగుతున్నప్పుడు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించినా లేదా అగౌరవపరిచినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటువంటి చర్యలకు పాల్పడే వారికి చట్టప్రకారం గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నట్లు కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.






