- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వందేమాతరం @150.. దేశవ్యాప్తంగా జాతీయ గేయోత్సవాలు ప్రారంభం
భారత జాతీయ గేయం “వందేమాతరం” రచించి నేటికి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది

దిశ, వెబ్ డెస్క్: భారత జాతీయ గేయం “వందేమాతరం” రచించి నేటికి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో వందేమాతరం 150 వ వార్షికోత్సవ వేడుకలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఉదయం 9.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వార్షికోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంలో వందేమాతరం సంస్కరణోత్సవాలు ఈ ఏడాది పొడవునా చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, సాంస్కృతిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నాయి.
ఈ కార్యక్రమంలో జాతీయ గేయానికి అంకితమైన ప్రత్యేక నాణెం, పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు నవంబర్ 7, 2025 నుంచి నవంబర్ 7, 2026 వరకు కొనసాగనున్నాయి. వందేమాతరం రచయిత బంకించంద్ర ఛటర్జీ జ్ఞాపకార్థంగా ఈ వేడుకలు జరగనున్నాయి. దేశమంతటా మాస్ సింగింగ్ కార్యక్రమాలు, సంగీత ప్రదర్శనలు, సాంస్కృతిక ర్యాలీలు, చరిత్ర ప్రదర్శనలు నిర్వహించబడతాయి. యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను “జాతీయ ఐక్యతా సంబరాలు”గా పిలుపునిచ్చింది.






