- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UCC నుంచి వారికి మినహాయింపు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ఉమ్మడి పౌర స్మృతి (UCC) నుంచి గిరిజనులను మినహాయింపు ఇవ్వబోతున్నామని అమిత్ షా తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సివిల్ కోడ్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సివిల్ కోడ్ వస్తే..చొరబాటుదారులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేరని అన్నారు. అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ గోల్‌పారా జిల్లాలోని దుధ్నోయ్‌లో ర్యాలీలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి (UCC)ని అమలు చేస్తామని, దీనివల్ల చొరబాటుదారులు నలుగురు మహిళలను వివాహం చేసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
చొరబాటుదారులకు చెక్:
అస్సాంలో చొరబాటుదారులు గిరిజన మహిళలను వివాహం చేసుకుని రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారని అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు. పొరుగు రాష్ట్రమైన మేఘాలయలోని గారో హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌లో ఇలాంటి ప్రయత్నాల వల్లే అశాంతి నెలకొందని గుర్తు చేశారు. మరో ఐదేళ్లు అస్సాంలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని.. రాష్ట్రం నుండి ప్రతి ఒక్క చొరబాటుదారుడిని వెనక్కి తరిమేస్తామన్నారు.
గిరిజన ప్రాంతాలకు మినహాయింపు:
యూసీసీని తీసుకువచ్చినా, గిరిజన ప్రాంతాలను మాత్రం దీని పరిధి నుండి మినహాయిస్తామని షా స్పష్టం చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలోనే దేశానికి తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి (ద్రౌపది ముర్ము) దక్కారని, గిరిజనుల అభివృద్ధికి మోడీ, సీఎం హిమంత బిస్వా శర్మ ఒక రోడ్‌మ్యాప్ సిద్ధం చేశారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ శాంతిని పునరుద్ధరించిందని, ఒకవేళ కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలిచినా మళ్లీ అశాంతి మొదలవుతుందని ఆయన హెచ్చరించారు. అస్సాంలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.






