Vaibhav Suryavanshi: ప్రధానమంత్రి జాతీయ బాలల అవార్డు అందుకోనున్న వైభవ్‌

by Muthe.Rajitha |   (  Updated:2025-12-26 05:07:45  IST  )

కేవలం 14 ఏళ్ల వయసులోనే తన ప్రతిభతో దేశం దృష్టిని ఆకర్షించిన బీహార్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రతిష్టాత్మక ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ లభించనుంది.

Vaibhav Suryavanshi: ప్రధానమంత్రి జాతీయ బాలల అవార్డు అందుకోనున్న వైభవ్‌
X

దిశ, వెబ్ డెస్క్ : కేవలం 14 ఏళ్ల వయసులోనే తన ప్రతిభతో దేశం దృష్టిని ఆకర్షించిన బీహార్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రతిష్టాత్మక ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ లభించనుంది. ఈ అవార్డును స్వీకరించేందుకు ఆయన న్యూఢిల్లీలోకి చేరుకున్నారు. ఈ కారణంగా బీహార్ జట్టు తరఫున విజయ్ హజారే ట్రోఫీలో మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌ కు గైర్హాజరయ్యారు. న్యూఢిల్లీలో జరిగే ఈ అవార్డు ప్రదాన కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షత వహించనున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‌కు అవార్డు అందజేయనున్నారు.

కార్యక్రమం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీని కూడా వైభవ్ కలవనున్నాడు. చిన్న వయసులోనే అద్భుత బ్యాటింగ్‌తో గుర్తింపు పొందిన వైభవ్‌కు ఈ గౌరవం ఆయన కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలవనుంది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ ధైర్యం, స్పోర్ట్స్, ఆర్ట్స్, సైన్స్ వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన 5-18 ఏళ్ల పిల్లలకు ఇస్తారు.

Next Story