- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కన్నుమూత.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన CM
ఉత్తరాఖాండ్ రవాణా శాఖ మంత్రి చందన్ రామ్ దాస్ కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖాండ్ రవాణా శాఖ మంత్రి చందన్ రామ్ దాస్ కన్నుమూశారు. ఇటీవల చందన్ రామ్ దాస్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాగా, బాగేశ్వర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. దాస్ మరణవార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, దాస్ మరణంపై ఉత్తరాఖాండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఆయన మృతిపట్ల సీఎం సంతాపం వ్యక్తం చేశారు. దాస్ మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. చందన్ రామ్ దాస్ మరణం ప్రజాసేవ, రాజకీయ రంగాలకు తీరని లోటు అని పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు. ఇక, బాగ్వేశర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న చందన్ రామ్ దాస్.. సాంఘిక సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.






