- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amit Shah: అమిత్ షా కుమారుడి పేరుతో మోసాలు
కేంద్రహోంమంత్రి అమిత్ షా కుమారుడు, ఐసీసీ ఛైర్మన్ జైషా పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రహోంమంత్రి అమిత్ షా కుమారుడు, ఐసీసీ ఛైర్మన్ జైషా పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. హరిద్వార్‌లోని రాణిపూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆదేశ్ చౌహాన్ నుండి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే ఆదేశ్ చౌహాన్‌కు గుర్తుతెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది, కాల్ చేసిన వ్యక్తి తనను తాను జైషాగా పరిచయం చేసుకున్నారు. పార్టీకి రూ.5 లక్షలు విరాళం ఇవ్వాలని ఆ వ్యక్తి ఎమ్మెల్యేని అడిగాడు. అనుమానం వచ్చిన ఎమ్మెల్యే ఫోన్ చేసిన వ్యక్తిని ప్రశ్నించారు. దీంతో, తమిద్దరి మధ్య జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో పెడతానని చౌహాన్ ని దుండగుడు బెదిరించాడు. ఎమ్మెల్యే పరువు తీస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో, వెంటనే చౌహాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు ప్రియాంషు పంత్ ని ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు.
మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు..
అంతేకాకుండా మంత్రిపదవులు ఇప్పిస్తానని నైనితాల్ ఎమ్మెల్యే సరితా ఆర్య, రుద్రపూర్ ఎమ్మెల్యే శివ్ అరోరాల నుంచి డబ్బులు గుంజేదుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడితో సంబంధం ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను గుర్తించి, వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరొకరు ప్రస్తుతం పరారీలో ఉన్నారని.. అతడికోసం గాలింపు చర్యలు చేపట్టమన్నారు.






