- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తప్పిన ప్రమాదం..! ఉత్తరాఖండ్ గవర్నర్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మిత్ సింగ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మిత్ సింగ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పౌడీ గర్వాల్ జిల్లాలోని శ్రీనగర్ పరిధిలో ఉన్న జీవీకే (GVK) హెలిప్యాడ్‌లో పైలట్లు హెలికాప్టర్‌ను సురక్షితంగా కిందికి దించడంతో ప్రమాదం తప్పినట్లైంది. పౌడీ పోలీసుల సమాచారం ప్రకారం.. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న సమయంలో మార్గమధ్యలో అకస్మాత్తుగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ముందుజాగ్రత్త చర్యగా వెంటనే జీవీకే హెలిప్యాడ్‌లో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ల్యాండింగ్ అనంతరం గవర్నర్‌ను శ్రీనగర్‌లోని పోలీస్ గెస్ట్ హౌస్‌కు తరలించారు.
ఊపిరి పీల్చుకున్న అధికారులు!
ఈ ఘటనపై పౌడీ గర్వాల్ సర్కిల్ ఆఫీసర్ అనుజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘గవర్నర్ హెలికాప్టర్ జీవీకే హెలిప్యాడ్‌లో ల్యాండ్ అయింది. ఆయన ప్రస్తుతం సేఫ్ హౌస్‌లో సురక్షితంగా ఉన్నారు. ఈ విషయమై జిల్లా యంత్రాంగం అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటోంది’ అని స్పష్టం చేశారు. గవర్నర్ సురక్షితంగా ఉండటంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.






