Uttarakhand: మంచుచరియలు విరిగిపడ్డ ఘటనలో ఏడుకు చేరిన మరణాలు

by Shamantha N |

ఉత్తరాఖండ్‌ (Uttarakhand Avalanche )లో మంచుచరియలు విరిగిపడ్డ ఘటనలో మరో మూడు డెడ్ బాడీలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు.

Uttarakhand: మంచుచరియలు విరిగిపడ్డ ఘటనలో ఏడుకు చేరిన మరణాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌ (Uttarakhand Avalanche )లో మంచుచరియలు విరిగిపడ్డ ఘటనలో మరో మూడు డెడ్ బాడీలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. మంచు దిబ్బల కింద ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. దీంతో, ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ఏడుకి చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న మరో కార్మికుడిని గుర్తించేందుకు ఆర్మీ తీవ్రంగా శ్రమిస్తోంది. కాగా.. ఆచూకీ దొరకని మిగతా నలుగురి కోసం గాలింపు కొనసాగించగా.. ఆదివారం ఉదయం మరో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. మరో కార్మికుడి జాడ తెలియాల్సి ఉంది. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు జోషిమట్ నుంచి మరో ఎస్‌డీఆర్ఎఫ్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుంది. థర్మల్ ఇంజిన్ కెమెరా సాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

మంచుచరియలు విరిగి పడి..

బద్రీనాథ్‌ క్షేత్రానికి సమీపంలో ఛమోలీ జిల్లాలోని మనా గ్రామం వద్ద శుక్రవారం మంచు చరియలు విరిగిపడ్డాయి. ఇది భారత్‌-టిబెట్‌ సరిహద్దులో మన దేశానికి చెందిన చివరి గ్రామం. జాతీయరహదారిపై భారీగా పేరుకుపోయిన మంచుని సరిహద్దు రహదారుల సంస్థ (BRO) సిబ్బంది తొలగిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. మంచు చరియలు విరిగిపడి 58 మంది అందులో కూరుకుపోయారు. వెంటనే ఆర్మీ, సహాయక బృందాలు రంగంలోకి దిగి 54 మందిని కాపాడారు. వారిని ఎయిర్‌లిఫ్ట్‌తో జోషి మఠ్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. వారిలో తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికులు చికిత్స పొందుతూ మృతిచెందారు.

Next Story