- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
USB: ఆఫీసుల్లో యూఎస్‌బీ, పెన్ డ్రైవ్‌ల నిషేధం.. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం
సైబర్ క్రైమ్, డేటా చోరీల ఆందోళనల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: సైబర్ క్రైమ్, డేటా చోరీల ఆందోళనల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ విభాగాల్లోని అధికారిక పరికరాల్లో యూఎస్‌బీ (USB), పెన్ డ్రైవ్ (Pen drive) ల వాడకాన్ని నిషేధించింది. ఈ మేరకు సెక్రటేరియట్ కమిషనర్ ఎం రాజు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. భద్రతా స్థితిని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ‘జమ్మూ కశ్మీర్‌లో సున్నితమైన ప్రభుత్వ సమాచారాన్ని రక్షించడం, డేలా ఉల్లంఘనలు, మాల్వేర్ ప్రాబ్లమ్స్, అనధికార యాక్సెస్ ప్రమాదాలను తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోని పరికరాల్లో పెన్ డ్రైవ్, యూఎస్ బీల వాడకాన్ని నిషేధించాం’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక వేళ పెన్ డ్రైవ్ వాడాలనుకుంటే ఎన్ఐసీ సెల్‌కు నేరుగా అప్లికేషన్ ఇవ్వాలని సూచించారు. నిబంధనలు పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మార్గదర్శకాల అమలుకు అన్ని విభాగాలు సహకరించాలని తెలిపారు.






