- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
USAID: 83 శాతం యూఎస్ ఎయిడ్ కార్యక్రమాలను రద్దు చేసిన అమెరికా
ఆరు వారాల పాటు సమీక్ష చేపట్టిన అనంతరం దాదాపు 83 శాతం కార్యక్రమాలను అధికారికంగా రద్దు చేశాం.

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ ఎయిడ్ ద్వారా నిర్వహిస్తున్న వేలాది కార్యక్రమాలను రద్దు చేసినట్టు అమెరికా విదేశాంగశాఖ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు. ఇకపై విదేశాంగశాఖ కింద కేవలం కొన్ని కార్యక్రమాలకు మాత్రమే ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపారు. ఆరు వారాల పాటు సమీక్ష చేపట్టిన అనంతరం దాదాపు 83 శాతం కార్యక్రమాలను అధికారికంగా రద్దు చేశాం. రద్దయిన 5,200 కార్యక్రమాలు అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడవని(కొన్ని సందర్భాల్లో జాతీయ ప్రయోజనాలకు హానీ కూడా), అదనంగా కోట్లాది రూపాయల ఖర్చవుతోందని మార్కొ రూబియో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తమకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యం. కాంగ్రెస్‌తో సంప్రదించి మిగిలిన కార్యక్రమాల నిర్వహ్ణను కొనసాగించాలని నిర్ణయించినట్టు, ఈ సంస్కరణల కోసం కష్టపడిన డోజ్ సిబ్బందికి మార్క్ ధన్యవాదాలు చెప్పారు. కాగా, రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ఎయిడ్ కార్యకలాపాలను స్తంబింపజేశారు. అంతర్జాతీయంగా ఈ కార్యక్రమం కింద అందించే నిధులను తాత్కాలికంగా నిలిపేశారు. వాటి నిమిత్తం పనిచేసే వేలాది మందిని ఉద్యోగంలోంచి తొలగించారు.






