ఇది మోడీ చేయిస్తున్న యుద్ధమే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై యూఎస్

by Phanindra |

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై యూఎస్ వాణిజ్య సలహాదారు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇది మోడీ చేయిస్తున్న యుద్ధమేనంటూ విమర్శలు చేశారు.

ఇది మోడీ చేయిస్తున్న యుద్ధమే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై యూఎస్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌పై అమెరికా సుంకాలు మొదలైన గంటల వ్యవధిలోనే యూఎస్ మరోసారి షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ‘మోడీ చేస్తున్న యుద్ధం’ అని వైట్ హౌస్ ట్రేడ్ సలహాదారు పీటర్ నవారో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం వల్లనే ఈ యుద్ధం కొనసాగుతోందని నవారో ఆరోపించారు. ఈ చమురు కొనడం ఆపేస్తే యూఎస్ వేస్తున్న సుంకాలు 25 శాతం తగ్గుతాయన్నారు. ‘ఇది మోడీ యుద్ధమే. ఎందుకంటే శాంతికి వెళ్లే మార్గం న్యూఢిల్లీ గుండానే వెళ్తుంది’ అని నవారో అభిప్రాయపడ్డారు. భారత్‌కు డిస్కౌంట్‌లో చమురు అమ్ముతున్న రష్యా.. ఆ డబ్బుతో ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని కొనసాగిస్తోందని, దీంతో ఉక్రెయిన్‌కు యూఎస్ సహకారం చేయడం వల్ల అమెరికాకు నష్టం వాటిల్లుతోందని నవారో వివరించారు.

‘ఇండియా చేస్తున్న పని వల్ల యూఎస్‌లో అందరికీ నష్టమే. భారత సుంకాల వల్ల అమెరికాలోని వినియోగదారులు, వ్యాపారులు, ఉద్యోగులు, ఫ్యాక్టరీలు అందరికీ నష్టాలే. వీటిని సరిదిద్దేందుకు, మోడీ చేస్తున్న ఈ యుద్ధాన్ని నిలువరించేందుకు యూఎస్ ప్రజలపై భారం పడుతోంది’ అని నవారో పేర్కొన్నారు. భారత్ ఈ విషయంలో చాలా యారొగెంట్‌గా వ్యవహరించడం బాధాకరమన్నారు. ‘మాకు సుంకాలు ఎక్కువేం కాదు. మా సార్వభౌమత్వం ముఖ్యం. మా ఇష్టం వచ్చిన వారి నుంచి చమరు కొంటాం’ అని భారత్ అంటుందని, అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అలాంటి బాధ్యతతో వ్యవహరించాలని నవారో సూచించారు.

Next Story