- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచ శాంతి కోసం కొత్త గ్రూప్? యూఎన్‌కు పోటీగా ‘బోర్డ్ ఆఫ్ పీస్’
ప్రపంచ శాంతి కోసం కొత్త గ్రూప్‌ను ఏర్పాటు చేసేందుకు ట్రంప్ నిర్ణయించారు. యూఎన్‌కు పోటీగా ‘బోర్డ్ ఆఫ్ పీస్’ తెస్తున్నారట.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ శాంతి కోసం డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యూఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ‘బోర్డ్ ఆఫ్ పీస్’ పేరుతో ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంస్థలో శాశ్వత సభ్యత్వం కావాలనుకునే దేశాలు భారీ ఫీజు చెల్లించాలని సమాచారం. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ప్రతిపాదన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ బోర్డులో శాశ్వత సభ్యులు కావాలనుకునే దేశాలు ఏకంగా బిలియన్ డాలర్ల ఫీజు చెల్లించాలని ట్రంప్ సర్కారు ప్రతిపాదించింది. యుద్ధం ముగిసిన తర్వాత గాజాపై ఒక కన్నేసి ఉంచడానికి, మరోసారి యుద్ధ పరిస్థితులు రాకుండా చూసేందుకు ఈ బోర్డ్ ఆఫ్ పీస్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు అంటున్నారు. అయితే ఆ తర్వాత దీన్ని మరింత విస్తృతం చేస్తారని తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితిని ఢీకొట్టే స్థాయికి దీన్ని తీసుకెళ్లాలని ట్రంప్ భావిస్తున్నారట. ఈ సంస్థకు ట్రప్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
డ్రాఫ్ట్ ప్రతిపాదనలోని వివరాల ప్రకారం, వివిధ దశల్లో మెంబర్‌షిప్‌ల స్ట్రక్చర్‌ను తీసుకొస్తున్నారు. అంటే ఈ సంస్థలో ఉండే ఒక్కో దేశం.. అది చెల్లించిన ఫీజును బట్టి ప్రభావం చూపిస్తుందన్నమాట. ఈ ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో ఏ దేశమైనా ఉచితంగా చేరవచ్చని, కానీ ఈ దేశాల ప్రభావం మెంబర్‌షిప్ పరిమితులకు లోబడి ఉంటుందని అమెరికా అధికారులు చెప్తున్నారు. ‘ప్రతి సభ్యదేశం మూడేళ్లకు మించి టర్మ్‌లో ఉండదు. ఈ టర్మ్‌ను రీన్యూవల్ చేసుకోవచ్చు. కానీ ఆ నిర్ణయం పూర్తిగా సంస్థ చైర్మన్ డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఉంటుంది’ అని డ్రాఫ్ట్ ప్రతిపాదన స్పష్టంచేస్తోంది. ఇది కేవలం ఉచితంగా జాయిన్ అయ్యే వారికే. అలా కాకుండా శాశ్వతం సభ్యత్వం కోసం తొలి ఏడాదిలోనే బిలియన్ డాలర్లు అందించిన దేశాలకు ఈ టర్మ్ లిమిట్ ఉండదు. గాజా పునర్నిర్మాణం కోసమే ఈ డబ్బును ఉపయోగిస్తామని అమెరికా చెప్తోంది. వ్యవస్థాపక చైర్మన్‌గా ఏ దేశాలను సభ్యత్వం కోసం ఆహ్వానించాలి? గ్రూప్ అధికారిక సీల్‌ను ఆమోదించడం, అవసరమైతే సభ్యులను తొలగించడం, తన వారసుడిని ఎంపిక చేయడం వంటి అధికారాలు ట్రంప్ చేతుల్లో ఉంటాయి. ఆయన ఏ దేశాన్నయినా సంస్థ నుంచి తొలగించినా.. మూడింట రెండో వంతు ఓట్లతో సదరు నిర్ణయాన్ని వీటో చేయొచ్చు.
యూఎన్‌కు పోటీగానే..?
ప్రస్తుతం గాజా మీదనే ఈ సంస్థ ఫోకస్ పెట్టినప్పటికీ.. భవిష్యత్తులో ప్రపంచంలో ఎక్కడ సమస్యలు తలెత్తినా ఈ బోర్డు స్పందిస్తుందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దేశాల మధ్య జరిగే యుద్ధాలను అడ్డుకునే విషయంలో కచ్చితంగా జోక్యం చేసుకుంటుందని స్పష్టంచేశారు. అంతర్జాతీయ సమస్యలు తీర్చేందుకు ధైర్యంగా నిర్ణయం తీసుకునే శక్తిగా బోర్డును అమెరికా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దీనిలో చేరాలంటూ అర్జెంటీనా ప్రెసిడెంట్ జావియర్ మిలీ, పెరుగ్వే నేత శాంటియాగో పీ, ఈజిప్ట్ అధ్యక్షుడు ఆబ్దేల్ ఫతా ఎల్‌సిసీ, తుర్కియే ప్రెసిడెంట్ రీసెప్ తాయిప్ ఎర్డోగాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ మాజీ గవర్నర్ మార్క్ కార్నీ, అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ సీఈవో మార్క్ రోవన్ తదితర శక్తిమంతమైన వ్యక్తులకు ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపినట్లు తెలుస్తోంది. సరిగా పనిచేయడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న యూఎన్‌ను రిప్లేస్ చేసేందుకే ట్రంప్ ఈ కొత్త ‘బోర్డ్ ఆఫ్ పీస్’ను తెస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.






