భారత్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? జర్నలిస్ట్ ప్రశ్నకు ట్రంప్ సమాధానమిదే..!

by Phanindra |

భారత్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అని యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఒక జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనిపై ట్రంప్ షాకింగ్ సమాధానం ఇచ్చారు.

భారత్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? జర్నలిస్ట్ ప్రశ్నకు ట్రంప్ సమాధానమిదే..!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌పై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు వేయడంపై ఆగ్రహం వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఈ సుంకాలు వివక్షాపూరితంగా ఉన్నాయని కూడా పలువురు అంటున్నారు. తాజాగా వైట్‌హౌస్‌లో మీడియాతో ట్రంప్ మాట్లాడుతుండగా ఆయనకు ఇదే ప్రశ్న ఎదురైంది. ‘రష్యా నుంచి చైనా వంటి ఇతర దేశాలు కూడా చమురు కొనుగోలు చేస్తున్నాయని భారత అధికారులు అంటున్నారు.

అలాంటప్పుడు కేవలం భారత్‌నే యూఎస్ ఎందుకు టార్గెట్ చేస్తోంది?’ అని ట్రంప్‌ను ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన అమెరికా అధ్యక్షుడు.. ‘ఈ సుంకాలు విధించి కేవలం 8 గంటలే అయింది. ఏం జరుగుతుందో చూస్తుండండి. ఇంకా చాలా దేశాలపై రెండో విడత టారిఫ్‌లు ఉంటాయి. అవన్నీ మీరు చూస్తారు’ అని ప్రకటించారు. దీంతో మరిన్ని దేశాలపై ట్రంప్ సుంకాలు విధించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Next Story