- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
S Jaishankar: కాల్పుల విరమణలో ట్రంప్ ప్రమేయం లేదు: ఎస్ జైశంకర్
హాట్‌లైన్‌లో రెండు దేశాలు చర్చించిన తర్వాత అందుకు అంగీకరించినట్టు స్పష్టం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తనవల్లే జరిగిందని, రెండు దేశాలు అణు యుద్ధానికి దిగకుండా ఆపింది తానేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేనిపోనీ బీరాలు పలుకుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి అంతర్జాతీయ వేదికపై స్పష్టత ఇచ్చారు. నెదర్లాండ్స్‌కు చెందిన మీడియా ఎన్ఓఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఈ వ్యవహారంలో ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని నిరాకరించారు. భారత్, మధ్య జరిగిన కాల్పుల విరమణలో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని, హాట్‌లైన్‌లో రెండు దేశాలు చర్చించిన తర్వాత అందుకు అంగీకరించినట్టు స్పష్టం చేశారు. ఇందులో ట్రంప్ జోయం అస్సలు లేదని తెగేసి చెప్పారు. ఇంటర్వ్యూలో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఒక పాలసీగా ఉపయోగిస్తోందని, దీనిపై భారత్ దీర్ఘకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. తాజాగా పెహల్గాంలో జరిగిన దాడి కారణంగా 26 మంది సామాన్యులు, పర్యాటకులు మరణించారు. అందుకు స్పందించే హక్కు భారత్‌కు ఉందని తెలిపారు. మతపరమైన విభేదాలు సృష్టించే లక్ష్యంతో పాకిస్తాన్ పనిచేస్తోందన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతోనే ఆపరేషన్ సిందూర్ చేపట్టాం.
మే 7-10 తేదీల మధ్య అనేక దేశాలతో సంప్రదింపులు జరిపామని, అందులో అమెరికా కూడా ఉందని జైశంకర్ చెప్పారు. అయితే, భారత్, పాకిస్తాన్ ప్రతినిధులు చర్చలకు హాట్‌లై సదుపాయం ఉంది. మే 10న పాకిస్తాన్ నుంచి సందేశం వచ్చింది. కాల్పులు విరమించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పాక్ ఆర్మీ కోరింది. అందుకు భారత్ సానుకూలంగా స్పందించింది. అలాంటపుడు ఇరు దేశాల మధ్య అమెరికా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అమెరికా అమెరికాలోనే కదా ఉంది. అయితే, ఈ విషయంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, వైస్-ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌లు కూడా తనతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడినట్టు ధృవీకరించారు. కానీ, ఉద్రిక్తతలను తగ్గించాలని సంభాషణకే వారి ప్రమేయం పరిమితమని జైశంకర్ పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఇతర దేశాల నుంచి కూడా సంప్రదింపులు జరిగాయి. ఏ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినా.. ఇతర దేశాలు చొరవతో ఫోన్ చేసి మాట్లాడ్డం సహజం. కాల్పుల విరమణ జరగాలంటే పాకిస్తాన్ నేరుగా భారత్‌తోనే మాట్లాడాలని కూడా అన్ని దేశాల వారికి చెప్పామని ఆయన వెల్లడించారు.






