- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా వీసాలపై అదనంగా ‘ఇంటిగ్రిటీ ఫీజు’.. 2026 నుంచి అమల్లోకి!
అమెరికా వీసాలపై అదనంగా ‘ఇంటిగ్రిటీ ఫీజు’ వేయాలని యూఎస్ నిర్ణయించింది. 2026 నుంచి ఈ సర్ చార్జ్ అమల్లోకి రానుంది.

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్‌లోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కొత్త ఇమిగ్రేషన్ పాలసీని తీసుకొచ్చింది. ఇటీవల చట్టరూపం దాల్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’లో కొత్తగా 250 డాలర్ల వీసా ఇంటిగ్రిటీ ఫీజును ప్రవేశపెట్టింది. సాధారణ వీసా చార్జీలకు ఇది అదనం కావడం గమనార్హం. దానికితోడు ద్రవ్యోల్బణాన్ని బట్టి ఈ ధర మారుతూ ఉంటుందని ట్రంప్ సర్కారు తెలిపింది. శుక్రవారం నాడు ఈ బిల్లుపై ట్రంప్ సంతకం చేసిన సంగతి తెలిసిందే.
ఈ చట్టం ప్రకారం, 2026 నుంచి నాన్-ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తులు చేసుకున్న ప్రతి ఒక్కరూ ‘ఇంటిగ్రిటీ ఫీజు’ను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. టూరిస్ట్, బిజినెస్, స్టూడెంట్, వర్క్ (హెచ్1బీ), ఎక్స్‌ఛేంజ్ వీసాలన్నింటికీ ఈ ఫీజు వర్తిస్తుంది. కేవలం ఏ, జీ కేటగిరీలకు చెందిన డొప్లొమాటిక్ వీసాలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. వీసా ఇష్యూ చేసే సమయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) ఈ చార్చీ వేస్తుంది.






