Us visa: కాలేజీకి వెళ్లకపోతే వీసా రద్దు.. విదేశీ విద్యార్థులకు యూఎస్ వార్నింగ్

by B.Srinivas |

ఇమ్మిగ్రేషన్ రూల్స్‌ను కఠిన తరం చేస్తున్న అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Us visa: కాలేజీకి వెళ్లకపోతే వీసా రద్దు.. విదేశీ విద్యార్థులకు యూఎస్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇమ్మిగ్రేషన్ రూల్స్‌ ను కఠిన తరం చేస్తున్న అమెరికా (America) మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూఎస్‌లోని విద్యా సంస్థల్లో విద్యనభ్యసించే భారత్ సహా విదేశీ విద్యార్థులకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంలో చదువుకుంటున్న ఫారెన్ స్టూడెంట్స్ (Students) తరగతులకు హాజరుకాకపోయినా, విద్యా సంస్థకు సమాచారం ఇవ్వకుండా చదువు మానేసినా వారి విద్యార్థి వీసాలు రద్దు చేస్తామని తెలిపింది. అంతేగాక భవిష్యత్ లోనూ అమెరికా వీసా పొందకుండా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు భారత్‌లోని యూఎస్ ఎంబసీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

‘యూఎస్‌లో చదివే విద్యార్థులు కళాశాల నుంచి తప్పుకున్నా, తరగతులకు హాజరు కాకపోయినా, సదరు విద్యా సంస్థకు తెలియజేయకుండా కోర్సును ఆపేసినా స్టూడెంట్ వీసా రద్దు చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులోనూ మీకు అమెరికా వీసా కూడా మంజూరు చేయబడదు. ఎల్లప్పుడూ వీసా రూల్స్ పాటించాలి. ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాలి’ అని తెలిపింది. అమెరికాలోనే ఉంటే విద్యార్థిగానే కొనసాగాలని వెల్లడించింది. కాగా, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వలస నిబంధనలు కఠిన తరం చేసిన విషయం తెలిసిందే.

Next Story