- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ukraine: ఇది మా యుద్ధం కాదు.. ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలపై అమెరికా కీలక వ్యాఖ్యలు
ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం ముగించడం సాధ్యంకాకపోతే.. చర్చల ప్రయత్నాలు ఆపేస్తామని అమెరికా వెల్లడించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం ముగించడం సాధ్యంకాకపోతే.. చర్చల ప్రయత్నాలు ఆపేస్తామని అమెరికా వెల్లడించింది. చర్చలు ఆపేసి తమ దారి తాము చూసుకుంటామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తేల్చి చెప్పారు. కాగా.. పశ్చిమాసియాకు ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్‌తో కలిసి ఆయన ఐరోపా, ఉక్రెయిన్ నాయకులతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది మా యుద్ధం కాదు. మేం స్టార్ట్ చేయలేదు. గత మూడేళ్ల నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేస్తోంది. ఇక ఆ పనిని కూడా ముగించాలని మేము భావిస్తున్నాం. అధ్యక్షుడు ట్రంప్ దాదాపు 87 రోజులపాటు అత్యున్నత స్థాయిలో ఈ యుద్ధానికి ఓ ముగింపు తెచ్చేందుకు యత్నించారు. ఆయన శక్తిని, సమయాన్ని ఇందుకోసం అంకితం చేశారు. ఇక ఈ యుద్ధానికి ముగింపు సాధ్యమా.. కాదా అన్న విషయం మేం తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే ఇరుపక్షాలతో చర్చలు జరుపుతున్నాం’’ అని రూబియో చెప్పారు.
సంధికి యత్నం..
కాగా.. ఉక్రెయిన్- రష్యా మధ్య సంధి కుదిర్చేందుకు ట్రంప్ ఆసక్తిగా ఉన్నారని రూబియో అన్నారు. కానీ, ఆయనకు ఇతర ప్రాధాన్యాలు కూడా ఉన్నాయని రూబియో వివరించారు. ఈ చర్చల్లో పురోగతి కనిపించకపోతే ఆయన దీన్ని వదిలేసి ముందడుగు వేస్తామన్నారు. చాలాకాలంగా అమెరికా దీని కోసం ప్రయత్నిస్తుందన్నారు. మరోవైపు వచ్చే గురువారం ఉక్రెయిన్‌తో ఖనిజాల ఒప్పందం చేసుకోనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ‘‘మా అమెరికన్ భాగస్వాములతో మెమోరాండం ఆఫ్ ఇంటెంట్‌పై సంతకం చేసినట్లు ప్రకటించడానికి సంతోషిస్తున్నాం. ఈ ఒప్పందం ఇరుదేశాల ఆర్థిక భాగస్వామ్యం, దేశ పునర్నిర్మాణం, మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, వ్యాపారాలలో మద్దతు, కొత్త ఆర్థిక అవకాశాల సృష్టికి పెట్టుబడులు వంటి వాటికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’’ అని ఉక్రెయిన్ ఆర్థిక మంత్రి ఓ ప్రకటనలో ధ్రువీకరించారు. మరైవపు, ఐరోపా నేతలతో భేటీ సందర్భంగా ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై ట్రంప్ మాట్లాడారు. శాంతి స్థాపన అతి తొందరలోనే ఇది సాకారం కావచ్చని పేర్కొన్నారు. అమెరికా ఓ శాంతిఒప్పందం ముసాయిదా తయారుచేసి ఈయూ నేతలకు చెప్పగా.. వారి నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.






