అమెరికా జెండా తగలబెడితే ఏడాది జైలు.. ఆర్డర్స్‌పై సంతకం చేసిన ట్రంప్!

by Phanindra |

అమెరికా జెండా తగలబెడితే ఏడాది జైలు శిక్ష వేయాలని డొనాల్డ్ ట్రంప్ ఆర్డర్స్ వేశారు. ఈ కేసులో ఏం చేసినా ముందుగా విడుదలయ్యే అవకాశం లేదని తేల్చిచెప్పారు.

అమెరికా జెండా తగలబెడితే ఏడాది జైలు.. ఆర్డర్స్‌పై సంతకం చేసిన ట్రంప్!
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా జెండాను తగలబెడితే ఏడాదిపాటు జైలు శిక్ష విధించే చట్టంపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. గతంలో పలు నిరసనల్లో యూఎస్ జెండాకు నిప్పంటించిన ఘటనలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌కు ఆదేశాలు జారీ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై ట్రంప్ సంతకం పెట్టారు. ‘అమెరికా జెండాకు నిప్పంటిస్తే ఏడాదిపాటు జైలుకెళ్లాల్సిందే. ముందుగా విడుదలవ్వడం కుదరదు. కచ్చితంగా ఏడాది శిక్ష అనుభవించాల్సిందే. జెండా తగలబెట్టడం ఆందోళనలు సృష్టిస్తుంది’ అని ట్రంప్ అన్నారు.

కాగా, అమెరికా జెండా తగలబెట్టడం భావప్రకటనా స్వేచ్ఛ కిందకు వస్తుందని, అలా చేసిన వారిపై చర్యలు తీసుకోకూడదని 1989లో యూఎస్ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఇది చాలా బాధాకరమైన తీర్పు అన్న ట్రంప్.. జెండా తగలబెట్టడం ఆందోళనలు, నిరసనలు, హింసకు దారితీస్తే, అలా చేసిన వ్యక్తులను ప్రాసిక్యూట్ చేసేందుకు ఈ కొత్త ఆర్డర్ ఉపయోగపడుతుందని చెప్పారు. ఒకవేళ వలసదారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే వారి వీసాలు రద్దయ్యే ప్రమాదం కూడా ఉంది. అలా చేసిన వారికి గ్రీన్‌కార్డులు, పౌరసత్వం నిరాకరించవచ్చు.

Next Story