గుజరాత్ విమాన ప్రమాదంలో దర్యాప్తు చేసేందుకు వస్తున్న యూఎస్ టీం..!

by Phanindra |   (  Updated:2025-06-12 18:34:46  IST  )

గుజరాత్ విమాన ప్రమాదంలో దర్యాప్తు చేసేందుకు వస్తున్న యూఎస్ టీం. త్వరలోనే భారత్‌కు వస్తున్న ఎన్‌టీఎస్‌బీ బృందం.

గుజరాత్ విమాన ప్రమాదంలో దర్యాప్తు చేసేందుకు వస్తున్న యూఎస్ టీం..!
X

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లో ఎయిరిండియా విమానం కూలి, ఆ రాష్ట్ర మాజీ సీఎం సహా పలువురు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణం కనుక్కునేందుకు ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో భారత్‌కు సహకారం అందిస్తామని అమెరికాలో ఇలాంటి ప్రమాదాల ఇన్వెస్టిగేషన్ చేసే నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్‌టీఎస్‌బీ) తెలిపింది. ప్రస్తుతం భారత్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో.. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తోంది. దీనికి సహకరించేందుకు ఎన్‌టీఎస్‌బీ బృందం త్వరలోనే భారత్‌కు వస్తుందని సమాచారం. అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రోటోకాల్స్ ప్రకారం, ప్రమాదానికి సంబంధించిన అన్ని వివరాలను ఎన్‌టీఎస్‌బీకి భారత ప్రభుత్వం అందించనుంది. ఈ విషయంలో యూఎస్‌కు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) కూడా ఎన్‌టీఎస్‌బీతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

Next Story