- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుంకాలు విధించే హక్కు ట్రంప్‌కు లేదు.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు
అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివిధ దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లను కొట్టేసింది.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా సుప్రీంకోర్టు(US Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. వివిధ దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) విధించిన టారిఫ్‌లను కొట్టేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని తేల్చింది. ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను ట్రంప్ తిరిగి చెల్లించాల్సిందే అని స్పష్టం చేసింది. అయితే.. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో యూఎస్ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా లాభాల బాటపట్టాయి. ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్.. భారత్‌పై 18 శాతం సుంకాలు వసూలు చేస్తున్నారు. సుప్రీం తీర్పుతో భారత్ నుంచి వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికా సుప్రీంకోర్టులో ప్రెసిడెంట్ ట్రంప్‌నకు ముగ్గురు న్యాయమూర్తులు అనుకూలంగా ఉండగా.. ఆరుగురు న్యాయమూర్తులు వ్యతిరేకించారు.
అమెరికా రాజ్యాంగం ప్రకారం సుంకాలను విధించే అధికారం ఆ దేశ పార్లమెంట్‌కు ఉంటుంది. అయితే, ట్రంప్ సుంకాలను కీలకమైన ఆర్థిక, విదేశాంగ విధాన సాధనంగా ఉపయోగించారు. అయితే, ట్రంప్ సుంకాలను కీలకమైన ఆర్థిక, విదేశాంగ విధాన సాధనంగా ఉపయోగించారు. దీనిపై విచారణ చేపట్టిన అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.






