USA: పాక్ జర్నలిస్టుకు షాక్ ఇచ్చిన అమెరికా..!

by Shamantha N |

పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై అమెరికా పదే పదే స్పందిస్తుంది. ఆ ఘటనను ఖండిస్తూ.. భారత్ వైపు మాట్లాడుతోంది.

USA: పాక్ జర్నలిస్టుకు షాక్ ఇచ్చిన అమెరికా..!
X

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై అమెరికా పదే పదే స్పందిస్తుంది. ఆ ఘటనను ఖండిస్తూ.. భారత్ వైపు మాట్లాడుతోంది. అయితే, భారత్‌పై అమెరికా (USA) విదేశాంగశాఖను ప్రశ్నించి.. ఏదైనా వ్యాఖ్యలు చేయిద్దామని ప్రయత్నించిన పాక్‌ జర్నలిస్టుకు షాక్ తగిలింది. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొనడంపై అమెరికా విదేశాంగ ప్రతినిధి టామ్మీ బ్రూస్‌ను ఓ పాక్‌ జర్నలిస్టు అడిగాడు. దీనిపై బ్రూస్ స్పందిస్తూ.. ‘‘నేను ఈ విషయం గురించి మాట్లాడను. ఈ ఘటనపై ట్రంప్, మార్క్ రూబియో ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేశారు. వేరే దాని గురించి మాట్లాడుకుందాం. అందుకే ఈ విషయంపై మాట్లాడను. కాకపోతే, ఆ దాడిలో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుతున్నా. ఇంత నీచమైన దాడికి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడాలి’’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా, దాడి వెనుక పాక్ ప్రమేయం ఉందని భావిస్తున్నారా.. ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నం చేస్తారా అనే ప్రశ్నలపైనా బ్రూస్ స్పందించారు. ‘ పరిస్థితులు వేగంగా మారుతున్నట్లు మనం చూస్తున్నాం. వాటిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం. జమ్మూకశ్మీర్‌పై ఎటువంటి పొజిషన్‌ తీసుకోలేదు’’ అని వ్యాఖ్యానించారు.

ట్రంప్ ఏమన్నారంటే?

దాడి జరిగిన రోజే సోషల్‌ మీడియా ట్రూత్‌లో ట్రంప్‌ తొలిరోజే పోస్టు చేశారు. కశ్మీర్‌ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. ఉగ్రపోరుపై భారత్ కు అమెరికా మద్దతుగా నిలుస్తుందన్నారు. కాగా.. పెహల్గాంలో ఏప్రిల్‌ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు భయానక దాడికి పాల్పడ్డారు. పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ముష్కరుల కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story