ఇదొక భారీ విజయం.. భారత్ పై 25 శాతం పన్ను తగ్గొచ్చు : హింటిచ్చిన అమెరికా మంత్రి

by Naga Rani Yarlagadda |

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్ పై అమెరికా అదనపు పన్ను విధించిన విషయం తెలిసిందే.

ఇదొక భారీ విజయం.. భారత్ పై 25 శాతం పన్ను తగ్గొచ్చు : హింటిచ్చిన అమెరికా మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్ పై అమెరికా అదనపు పన్ను విధించిన విషయం తెలిసిందే. ఈ పన్ను నుంచి త్వరలోనే భారత్ కు ఉపశమనం కలిగే అవకాశం ఉన్నట్లుగా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హింటిచ్చారు. ప్రస్తుతం భారత్ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను తగ్గించుకోవడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. గతంలో రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడంతో అదనంగా 25 శాతం టారిఫ్ విధించడంతో.. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై 50 శాతం పన్నులు అమలవుతున్నాయి. ఇప్పుడు చమురు కొనుగోళ్లు తగ్గించుకోవడంతో.. త్వరలోనే 25 శాతం పన్నులు తగ్గించే ఛాన్స్ ఉన్నట్లు స్కాట్ అభిప్రాయపడ్డారు. ఇదొక భారీ విజయమని పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత్‌పై మొత్తం 50 శాతం వరకు టారిఫ్‌లు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. 2025 ఆగస్టులో ట్రంప్ భారత దిగుమతులపై టారిఫ్‌లను రెట్టింపు చేసి 50 శాతానికి పెంచారు.

Next Story