భారత్ నుంచి వచ్చే రొయ్యలపైనా సుంకాలు.. కొత్త చట్టం తెస్తున్న అమెరికా!

by Phanindra |

భారత్ నుంచి వచ్చే రొయ్యలపైనా సుంకాలు వేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. దీనికోసం కొందరు యూఎస్ సెనేటర్లు కొత్త చట్టం ప్రతిపాదించారు.

భారత్ నుంచి వచ్చే రొయ్యలపైనా సుంకాలు.. కొత్త చట్టం తెస్తున్న అమెరికా!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ నుంచి వచ్చే రొయ్యలను కూడా అమెరికా టార్గెట్ చేస్తోంది. లూసియానాలోని రొయ్యలు, క్యాట్‌ఫిష్ పరిశ్రమలను రక్షించాలని, భారత్ నుంచి తక్కువ ధరకే దిగుమతి అవుతున్న ఉత్పత్తులను ఆపేయాలని ఆ దేశంలో కొందరు సెనేటర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం అమెరికా సెనేటర్లు బిల్ క్యాసిడీ, సిండీ హైడ్ స్మిత్ కలిసి ‘ఇండియా ష్రింప్ టారిఫ్ చట్టం’ ప్రతిపాదించారు. దేశంలో ఎక్కడెక్కడి నుంచో లూసియానా గంబో, జంబాలయ, ష్రింప్ (రొయ్యలు), గ్రిట్స్ రుచిచూసేందుకు వస్తారని క్యాసిడీ అన్నారు.

ఇక్కడి క్యాట్‌ఫిష్, రొయ్యల పని చేసే వారు అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తారని, అందుకే వాటికి అంత డిమాండ్ ఉంటుందని ఆయన చెప్పారు. ఈ వ్యాపారులను, రంగాన్ని కాపాడేందుకే కొత్త చట్టం ప్రతిపాదించామన్నారు. భారత్ నుంచి వచ్చే రొయ్యలను చాలా తక్కువ నిబంధనలతో యూఎస్‌ మార్కెట్లో పడేస్తున్నారని, దీని వల్ల లూసియానా సీఫుడ్ రంగం దెబ్బతింటోందని హైడ్ స్మిత్ అన్నారు. క్యాసిడీ ప్రతిపాదించిన చట్టం వల్ల స్వదేశీ జాలర్లకు రక్షణ దొరుకుతుందని, అందుకే తాను కూడా ఈ చట్టానికి మద్దతిస్తున్నానని వెల్లడించారు.

Next Story