వెనిజులా ఆయిల్ నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా

by Muthe.Rajitha |

రష్యా రక్షణలో ఉన్న వెనెజువెలాకు చెందిన ఒక భారీ ఆయిల్ నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

వెనిజులా ఆయిల్ నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా
X

దిశ, వెబ్ డెస్క్ : రష్యా రక్షణలో ఉన్న వెనెజువెలాకు చెందిన ఒక భారీ ఆయిల్ నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే గతంలోనే తీవ్ర ఆంక్షల కారణంగా ఉత్తర అట్లాంటిక్‌ సముద్రంలో నిలిచిపోయిన ఈ ఆయిల్‌ ట్యాంకర్‌ను అమెరికా సైన్యం కొన్ని రోజులుగా నిరంతరం వెంబడిస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ ఆదేశాల మేరకు నౌకపైకి చేరుకున్న అమెరికా సైన్యం దానిని స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. అయితే ఈ నౌకకు రక్షణగా రష్యా జలాంతర్గామి ఉందని అమెరికా చెబుతోంది.

లెబనాన్‌లోని హెజ్‌బొల్లా సంస్థకు సంబంధించిన ఒక కంపెనీ కోసం అక్రమంగా చమురు స్మగ్లింగ్‌ జరుగుతోందన్న ఆరోపణలతోనే ఈ నౌకపై అమెరికా 2024లోనే నిషేధం విధించింది. గత నెలలో వెనెజువెలా వైపు వెళ్తున్న సమయంలో ఈ నౌకను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా కోస్ట్‌ గార్డ్‌ ప్రయత్నించగా, తప్పించుకుని అట్లాంటిక్‌ సముద్ర జలాల్లోకి వెళ్ళింది. కొన్ని వారాలుగా ఈ నౌకను వెంబడిస్తున్న అమెరికా సైన్యం, చివరకు దానిని స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించింది. ఈ వ్యవహారంపై ఇటు వెనిజులా గాని, అటు రష్యా గాని ఇంకా స్పందించలేదు.

Next Story