తనను తనే తినడం మొదలుపెట్టాడు.. ఇల్లీగల్ ఇమిగ్రెంట్‌పై షాకింగ్ కామెంట్స్!

by Phanindra |

డిపోర్టేషన్ కోసం విమానం ఎక్కిస్తే ఒక అక్రమ వలసదారు తనను తనే తినడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ వెల్లడించారు.

తనను తనే తినడం మొదలుపెట్టాడు.. ఇల్లీగల్ ఇమిగ్రెంట్‌పై షాకింగ్ కామెంట్స్!
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్‌లో అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఒక ‘ఆటోక్యానిబలిజం’ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ వలసదారులను తరలిస్తున్న విమానంలో ఒక వ్యక్తం తన శరీర భాగాలను తినేయడం ప్రారంభించాడని, ఈ క్రమంలో అతను తీవ్రంగా గాయపడటంతో అధికారులు.. సదరు వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారట. ఈ విషయాన్ని యూఎస్ సెక్రటరీ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ క్రిస్టీ నోయెమ్ వెల్లడించారు.

ఫ్లోరిడాలో గవర్నర్ రాన్ డిశాంటిస్, ప్రెసిడెంట్ ట్రంప్‌తో రౌండ్ టేబుల్ సమావేశం కోసం ఆమె వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఐసీఈ (ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్) అధికారులతో నేను మాట్లాడా. ఒక క్యానిబల్ (నరమాంసభక్షకుడు)ను విమానంలో కూర్చోపెట్టగానే అతను తను తనే తినడం ప్రారంభించాడని, ఈ క్రమంలో అతను తీవ్రంగా గాయపడటంతో విమానంలో నుంచి దిచేశామని వాళ్లు చెప్పారు’ అని ఆమె వెల్లడించారు.

ఇలాంటి దారుణమైన వ్యక్తులు అమెరికా వీధుల్లో తిరుగుతున్నారని, అలాంటి వారినే తాము టార్గెట్ చేసి ఇక్కడి నుంచి పంపేస్తున్నామని చెప్పారు. ‘మన పిల్లలు తిరిగే రోడ్లపై ఇలాంటి వాళ్లు ఉండాలా? మన కుటుంబాలు, చిన్నారులు ఉండే ప్రాంతాల్లో ఇలాంటి వాళ్లు ఉండకూడదు’ అని ఆమె స్పష్టంచేశారు.

Next Story