- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
US Visa: తప్పు చేస్తేనే కాదు.. సోషల్‌మీడియాలో పోస్టు పెట్టినా కఠిన శిక్ష..వీసా కూడా రాదు..! ట్రంప్ పాలనలో అంతే
US Immigrants Tightens Social Media Scrutiny: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్: US Immigrants Tightens Social Media Scrutiny: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న వస్తున్ను విదేశీయుల గురించి వారి వల్ల తమ దేశానికి ఏదైనా ముప్పు వాటిల్లుతుందా లేదా అనేది కూడా అంచనా వేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇక నుచి అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ , సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతీఒక్కరూ వారి సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను కూడా అక్కడి అధికారులతో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నేరుగా అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
వలసదారుల విషయంలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్న అమెరికా ప్రభుత్వం..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో జాతి వ్యతిరేక పోస్టులు పెట్టినట్లే తేలితే వారికి వీసాలు, గ్రీన్ కార్డులు మంజూరు చేయబోమని అమెరికా అధికారులు వెల్లడించారు. స్టూడెంట్ వీసాలు మొదలుకొని గ్రీన్ కార్డ్స్ దరఖాస్తుదారుల వరకు అందరి సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా ఉంచుతున్నామని అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ స్పష్టం చేసింది.
రాజ్యాంగంలోని మొదటి సవరణ వాక్ స్వాతంత్య్రానికి హామీ ఇచ్చే అమెరికాలోని విద్యార్థులకు వీసాలను ట్రంప్ పరిపాలన వివాదాస్పదంగా రద్దు చేసిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. అమెరికాకు వచ్చి సెమిటిక్ వ్యతిరేక హింస, ఉగ్రవాదాన్ని సమర్థించవచ్చని భావించే ఎవరైనా మరోసారి ఆలోచించాలని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ స్పష్టం చేశారు. ఇలా తప్పుడు పోస్టులు పెట్టిన 300మందికి గత నెలలో వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ కార్యదర్శి మార్కూ రూబియో తెలిపారు. అమెరికా పౌరులు కాని వారికి అమెరికన్లకు ఉన్నంత హక్కులు లేవని..వీసాలు జారీ చేయడం లేదా తిరస్కరించడం న్యాయమూర్తుల అభీష్టానుసారం కాదని..తమ అభిష్టం మేరకు ఉంటుందని రూబియో స్పష్టం చేశారు.
ఉగ్రవాద సంస్థలుగా అమెరికా వర్గీకరించిన హమాస్, పాలస్తీయన్ ఇస్లామిక్ జిహాద్, లెబనాన్ హిజ్బుల్లా, యెమెన్ హౌతీల వంటి గ్రూపులకు మద్దతు ఇచ్చినట్లయితే వాటిని యూదు వ్యతిరేక చర్యలుగా పరిగణిస్తామని అమెరికా తెలిపింది. అలాంటి ఉగ్రకార్యకలపాలను ప్రచారం చేసినా వాటి గురించి సోషల్ మీడియాలో అనుకూలంగా పోస్టులు చేసినా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించింది.






