త్వరలో ముగిస్తాం: ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-11 14:47:39  IST  )

త్వరలోనే ఇరాన్‌తో యుద్ధం ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ..

త్వరలో ముగిస్తాం: ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలోనే ఇరాన్‌(Iran)తో యుద్ధం(War) ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump) కీలక ప్రకటన చేశారు. ఇరాన్-అమెరికా, ఇజ్రాయిల్(America, Israel) మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్‌పై తాజా ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్‌లో అన్ని లక్ష్యాలను ఛేదించామన్నారు. ఇరాన్ వద్ద మింగిలింది ఏమీ లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను అనుకున్నప్పుడే యుద్ధం ఆగిపోతుందని ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే అమెరికా సైనిక స్థావరాలపైనా తాజాగా ఇరాన్ దాడి చేసింది. ప్రస్తుతం ఈ దేశాల మధ్య జరుగుతున్న వార్ వల్ల ప్రపంచ దేశాల్లో ఆయిల్ సంక్షోభం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్ లాంటి దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధాన్ని ముగిస్తేనే ఆర్థిక పరిస్థితులు దెబ్బతినకుండా ఉంటాయనే భావనకు ట్రంప్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వార్ ముగిస్తానంటూ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

అమెరికా టెక్ కంపెనీలను టార్గెట్ చేసిన ఇరాన్!

Next Story