- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోడీతో మార్కో రూబియో కీలక చర్చలు.. అమెరికా రావాలని ఆహ్వానం
భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో.. ప్రధాని నరేంద్రమోడీతో ఢిల్లీలో భేటీ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో.. ప్రధాని నరేంద్రమోడీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రగతిపై ఇరువురు చర్చించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్వేచ్ఛాయుత వాతావరణాన్ని పెంపొందించడం, ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని విస్తరించడం, అత్యాధునిక సాంకేతిక రంగాలలో పరస్పర సహకారం, ఇంధన రంగంపై కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ భేటీలోనే మార్కో రూబియో.. అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రధానిని మోడీని అమెరికాకు ఆహ్వానించారు. త్వరలోనే వైట్ హౌస్ ను సందర్శించేందుకు రావాలని కోరారు. ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన బేధాభిప్రాయాలున్నప్పటికీ.. భారత్ - అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు మార్కో రూబియో ఆహ్వానం కీలక మైలురాయిగా నిలిచింది.
కాగా.. ప్రధాని మోడీతో మార్కోరూబియో జరిపిన చర్చలు సఫలమయ్యే విధంగానే ఉన్నట్లు భారతదేశంలో అమెరికా రాయబారి సర్జియోగోర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ముఖ్యంగా భారత్ కు పెద్దఎత్తున ఇంధనాన్ని విక్రయించేందుకు అమెరికా ఆసక్తి చూపించిందని, భారత్ ఎంత కావాలంటే అంత ఇంధనాన్ని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని రూబియో వ్యాఖ్యానించారు. అలాగే.. మార్కోరూబియోను కలవడం చాలా ఆనందంగా ఉందని, ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం, అంతర్జాతీయ శాంతిభద్రతలపై చర్చించినట్లుగా ప్రధాని ఎక్స్ లో పేర్కొన్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయన్నారు.






