- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగాల్‌లో భారీ విజయం: మోడీని అభినందించిన ట్రంప్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం 'చారిత్రాత్మకమైనది, నిర్ణయాత్మకమైనది' అని ట్రంప్ అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా భారత ప్రజాస్వామ్య గొప్పతనాన్ని ట్రంప్ కొనియాడారు. రాబోయే కాలంలో భారత్-అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ, సాంకేతికత, ఆర్థిక రంగాలలో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ పోషిస్తున్న పాత్రను ట్రంప్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
భారత-అమెరికా మైత్రి..
గత కొన్నేళ్లుగా భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధాలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. ట్రంప్, మోడీ మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహం, రెండు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన బంధాన్ని మరింత ధృడపరిచింది. బెంగాల్‌లో విజయంపై ట్రంప్ స్పందించిన తీరు, అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పింది.






