మస్క్ విషయంలో ట్రంప్ యూటర్న్.. ఇంకా ఎదగాలంటూ పోస్టు!

by Phanindra |

మస్క్ విషయంలో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. యూఎస్ వ్యాపారాలు ఇంకా ఎదగాలంటూ పోస్టు పెట్టారు.

మస్క్ విషయంలో ట్రంప్ యూటర్న్.. ఇంకా ఎదగాలంటూ పోస్టు!
X

దిశ, నేషనల్ బ్యూరో: బిలియనీర్ ఎలాన్ మస్క్‌పై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నారు. మస్క్ బిజినెస్ బాగా జరగాలని కోరుకుంటున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాన్ మస్క్‌కు సంబంధించిన కంపెనీలకు లభిస్తున్న సబ్సిడీలను తొలగిస్తారనే వార్తలను కూడా ట్రంప్ ఖండించారు.

‘యూఎస్ ప్రభుత్వం నుంచి మస్క్ కంపెనీలకు లభించే సబ్సిడీలను నేను వెనక్కు తీసుకుంటానని, ఆ కంపెనీలను నాశనం చేసేస్తానని ప్రచారం జరుగుతోంది. ఇది ఏమాత్రం నిజం కాదు. నేను ఎలాన్ ఒక్కడే కాదు.. మన దేశంలో జరిగే ప్రతి వ్యాపారాలన్నీ ఎప్పుడూ లేనంత అద్భుతంగా ఎదగాలని కోరుకుంటా’ అని తన ట్రూత్ సోషల్‌లో రాశారు ట్రంప్.

ఈ బిజినెస్‌లు ఎదిగితేనే యూఎస్ అభివృద్ధి చెందుతుందని, మొత్తం దేశానికి లాభం చేకూరుతుందని చెప్పారు. ‘వాళ్లు ఎంతగా ఎదిగితే.. యూఎస్‌కు అంత మంచిది. అది మనందరికీ మంచిది. మనం ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగాలి’ అని ట్రంప్ రాసుకొచ్చారు.

Next Story