- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌లో భారీ ఉగ్రదాడి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన
జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లో జరిగిన ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లో జరిగిన ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దాడిలో 30 మంది అమాయకులు చనిపోయారన్న విషయం తెలిసి చాలా బాధపడినట్లు ప్రకటించారు. మృతులందరికీ నివాళులు అర్పించారు. ఈ క్లిష్ట సమయంలో భారత్(India)కు మద్దతిస్తామని.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి పూర్తి సహకారం అందిస్తామని సంచలన ప్రకటన చేశారు. కాగా, జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్‌గామ్‌లో పర్యటకులే లక్ష్యంగా మంగళవారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 30 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.






