భారత్, పాక్ మధ్య అణుయుద్ధం జరిగేదే.. నేనే ఆపా: ట్రంప్

by Phanindra |

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణాన్ని అడ్డుకుంది తనేనని డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. అణుయుద్ధాన్ని అడ్డుకున్నానన్నారు.

భారత్, పాక్ మధ్య అణుయుద్ధం జరిగేదే.. నేనే ఆపా: ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పించింది తనేనని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. ద్వైపాక్షిక చర్చల కోసం సౌదీ అరేబియా వెళ్లిన ట్రంప్.. అక్కడ ప్రపసంగించారు. అణుబాంబులు వేసుకోకుండా, వ్యాపారం చేసుకోవాలని భారత్, పాక్‌ దేశాలకు చెప్పానని ట్రంప్ చెప్పుకొచ్చారు.

‘నేను వాణిజ్యాన్ని బాగా ఉపయోగించి ఈ కాల్పుల విరమణను సక్సెస్ చేశా. పరిస్థితి చెయ్యి దాటే సమయంలో మా ప్రభుత్వం బరిలో దిగి భారత్, పాక్ మధ్య శాంతి చేకూర్చింది. ఈ శాంతి కొనసాగుతుందని ఆశిస్తున్నా’ అని ట్రంప్ అన్నారు.

అంతర్జాతీయంగా యుద్ధాలను ఆపే శక్తి తనకే ఉందని ప్రచారం చేసుకుంటున్న ట్రంప్.. తాజాగా సిరియాపై యూఎస్ విధించిన ఆంక్షలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాము యూఎస్‌తో ఎలాంటి వాణిజ్యం మాట్లాడలేదని, పాక్ డీజీఎంవో తమను సంప్రదిస్తేనే కాల్పుల విరమణకు ఒప్పుకున్నామని భారత్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Next Story