- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరుస టారిఫ్‌లతో రెచ్చిపోతున్న ట్రంప్.. మరో సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెచ్చిపోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెచ్చిపోతున్నారు. వరుస టారిఫ్(Tariffs)లతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తు్న్నారు. తాజాగా కిచెన్ క్యాబినెట్లు ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. కలప దిగుమతులపై 10 శాతం సుంకాలు విధించారు. వచ్చే అక్టోబర్ 14వ తేదీ నుంచి కొత్త టారిఫ్‌లు అమలులోకి వస్తాయని తెలిపారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోని దేశాలపై ట్రంప్ సుంకాలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఫర్నీచర్ తయారు చేయకపోతే భారీస్థాయిలో సుంకాలను విధిస్తామని ట్రూత్ సోషల్‌లో హెచ్చరించారు. నిన్నటికి నిన్న సిమాలపై కూడా ట్రంప్ భారీగా సుంకాలు ప్రకటించారు. యూఎస్ వెలుపల నిర్మించే సినిమాలపై 100 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తానని ఆయన ప్రకటించారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.






