Indo-Pacific: ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో బీ2 బాంబర్ల మోహరింపు

by Shamantha N |

రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచదేశాలపై కఠినతర ఆంక్షలు విధిస్తున్నాడు.

Indo-Pacific: ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో బీ2 బాంబర్ల మోహరింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచదేశాలపై కఠినతర ఆంక్షలు విధిస్తున్నాడు. టారీఫ్ లతో వాణిజ్య యుద్ధానికి తెరతీసిన ట్రంప్.. ఇప్పుడు తన సైనిక కదలికల్ని మరింత పటిష్ఠం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. హిందూ మ‌హాస‌ముద్రం, ఇండోప‌సిఫిక్ ప్రాంతాల్లో.. బీ2 బాంబ‌ర్ల‌(B-2 Stealth Bomber)ను మోహ‌రించింది. అతిపెద్ద సంఖ్య‌లో బీ2 బాంబ‌ర్ల‌ను హిందూ మహాస‌ముద్రంలో మోహ‌రించేందుకు పెంటగాన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో డీగో గార్సియా దీవిలో ఉన్న మిలిట‌రీ బేస్‌ లో ఆరు బీ2 బాంబ‌ర్ విమానాల‌ను మోహ‌రించాయి. ప్లానెట్ ల్యాబ్స్ శాటిలైట్ చిత్రాల ఆధారంగా వాటిని క‌న్ఫ‌ర్మ్ చేశారు. ఇంకా అక్క‌డ ఉన్న షెల్ట‌ర్లు, హ్యాంగ‌ర్ల‌లో బాంబ‌ర్లు టాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

హిందూ మహాసముద్రంలోనే 30 శాతం..

అమెరికా వ‌ద్ద మొత్తం 20 బీ2 స్టీల్త్ బాంబ‌ర్లు ఉండగా.. వాటిలో అత్యాధునిక మిలిటరీ విమానాల్లో ఆరింటిని హిందూ మహాసముద్రంలో మోహరించారు. తమ వద్ద ఉన్న 30 శాతం యుద్ధ సామగ్రి అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. బీ2 బాంబ‌ర్ల‌తో పాటు యుద్ధ విమానాల‌ను మోసుకెళ్లే నౌక‌ల‌ను ఇండోప‌సిఫిక్ ప్రాంతంలో మోహ‌రిస్తున్నారు. రెండు యుద్ధ నౌక‌ల‌ను హిందూ మ‌హాస‌ముద్రంలోకి, ఒక‌టి ద‌క్షిణ చైనా సీ వ‌ద్ద‌కు తీసుకెళ్తున్నారు. యూఎస్ఎస్ కార్ల్ విన్‌స‌న్‌.. మిడిల్ ఈస్ట్‌కు వెళ్తోంది. ఇక యూఎస్ఎస్ హ్యార్ ఎస్ ట్రూమ‌న్‌.. ఆరేబియా స‌ముద్రం నుంచి ఆప‌రేట్ చేస్తుంది. ఇక మూడ‌వ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియ‌ర్ యూఎస్ఎస్ నిమిట్జ్‌.. ద‌క్షిణ చైనా స‌ముద్రం దిశ‌గా వెళ్లేందుకు వాషింగ్టన్ ప్లాన్ చేసింది. అక‌స్మాత్తుగా యుద్ధ నౌక‌ల‌ను ఎందుకు మోహ‌రిస్తుంద‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే హిందూ మ‌హాస‌ముద్ర ప్రాంతంలో ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ బ‌లోపేతం చేసే ఉద్దేశంతో ఈ చ‌ర్య చేప‌ట్టిన‌ట్లు అమెరికా సైన్యం తెలిపింది. హౌతీ మిలిటెంట్లు లక్ష్యంగా బీ2 బాంబ‌ర్ల‌ను అమెరికా మోహ‌రించిన‌ట్లు అనుమానిస్తున్నారు.

Next Story