- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏఐ చిప్స్ షిప్‌మెంట్స్‌లో ట్రాకింగ్ డివైజులు పెడుతున్న యూఎస్!
ఏఐ చిప్స్ షిప్‌మెంట్స్‌లో ట్రాకింగ్ డివైజులు పెడుతున్న యూఎస్. చైనాకు అక్రమంగా తమ చిప్‌లు వెళ్లనివ్వకూడదనే ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: తమ దేశం నుంచి ఎగుమతి చేస్తున్న అత్యాధునిక చిప్‌లు అక్రమంగా చైనాకు వెళ్లకుండా ఉండేందుకు యూఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని షిప్‌మెంట్లలో ట్రాకింగ్ డివైజులను ఉంచుతున్నారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. యూఎస్ ఎగుమతి ఆంక్షలు విధించిన దేశాలకు తమ అత్యాధునిక ఏఐ చిప్స్ షిప్‌మెంట్స్ డైవర్ట్ అవ్వకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి కేవలం కొన్ని షిప్‌మెంట్స్‌పై మాత్రమే యూఎస్ వర్గాలు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
చైనాకు చిప్ ఎగుమతులు వెళ్లకుండా అడ్డుకునేందుకు యూఎస్ ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్తున్నారు. యూఎస్ ఎగుమతి ఆంక్షలను ఉల్లంఘించి, అడ్డదారిలో భారీ లాభాలు సంపాదిస్తున్న కంపెనీలను గుర్తించేందుకు, షిప్‌మెంట్ మార్గాలపై నిఘా ఉంచేందుకు ఈ ట్రాకర్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా చేయడం యూఎస్‌కు ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు ఇలాంటి ట్యాక్టిక్స్‌తో ఎగుమతి దారులపై యూఎస్ నిఘా పెట్టింది.






