- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగింపు దశకు అమెరికా-ఇరాన్ యుద్ధం? శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా-ఇరాన్ (America-Iran) యుద్ధానికి ఎండ్ కార్డు వేసేందుకు ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు తుది దశకు చేరుకున్నాయి. యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో 14 క్లాజులతో కూడిన ఓ అవగాహన ఒప్పందం (MOU) దాదాపు సిద్ధమైందని ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే, ఈ చారిత్రాత్మక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో సాగుతున్న శాంతి చర్చలు క్రమబద్ధంగా, ఆశాజనకంగా సాగుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో పేర్కొన్నారు. అయితే తామేమీ ఈ ఒప్పందం కోసం తొందరపడటం లేదని స్పష్టం చేశారు. అధికారికంగా 2 దేశాలు ఒప్పందంపై సంతకాలు చేసేంత వరకు ఇరాన్ పోర్టులపై విధించిన సముద్ర దిగ్బంధం (Blockade) పూర్తిగా అమలులో ఉంటుందని తేల్చి చెప్పారు. అదేవిధంగా ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని తయారు చేయకూడదనే నిబంధనకు కట్టుబడి ఉండాలని ట్రంప్ డిమాండ్ చేశారు.
తెరుచుకోనున్న ‘హోర్ముజ్ జలసంధి’..
ప్రస్తుతం సిద్ధమవుతున్న ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం.. ఇరుపక్షాల మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ అమలు చేసి అన్ని విషయాలపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత వ్యూహాత్మకమైన ‘హోర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz)ని మళ్లీ తెరవనున్నారు. దీని ద్వారా ఇరాన్ అంతర్జాతీయ మార్కెట్లో చమురు అమ్ముకోవడానికి తాత్కాలికంగా వీలు పడుతుంది. ఇది ప్రపంచ చమురు సంక్షోభాన్ని తగ్గించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.






