ప్రధాని మోడీకి దేశ ప్రాధాన్యతే ముఖ్యం

by Ajay Maddhiboyina |

ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఉత్పత్తులపై విధించిన అధిక సుంకాలను ఎదుర్కోవడానికి ట్రంప్ తీసుకున్న చారిత్రాత్మక చర్య కారణంగా 60 దేశాలు పరస్పర సుంకాలను ఎదుర్కుంటున్నాయి.

ప్రధాని మోడీకి దేశ ప్రాధాన్యతే ముఖ్యం
X

- అమెరికా 27 శాతం సుంకాలు రేపటి నుంచి అమలు

- టారిఫ్‌ల ప్రభావాన్ని పరిశీలిస్తున్న వాణిజ్య మంత్రిత్వ శాఖ

- ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం కొనసాగుతున్న చర్చలు

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా విధించిన ట్రేడ్ రేట్ల పెంపు వల్ల దాని ప్రభావం దేశంపై పడుతుందని అంచనా వేస్తున్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అన్నారు. డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికా ఫస్ట్ నినాదం ఎలాగో.. ప్రధాని మోడీకి ఇండియా ఫస్ట్ అలాగని అన్నారు. అమెరికా విధించిన పరస్పర సుంకాల ప్రభావాన్ని తాము అంచనా వేస్తున్నామని పంకజ్ చౌదరి చెప్పారు. పీఎఫ్ఆర్డీయే నిర్వహించిన ఒక కార్యక్రమంలో గురువారం పాల్పొన్న మంత్రి పంకజ్‌ను సుంకాల ప్రభావంపై ప్రశ్నించగా.. ఆయన స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ పాలన ఆ దేశ వాణిజ్య లోటును తగ్గించి, తయారీని పెంచాలనే లక్ష్యంతో సాగుతోంది. అందుకే ఇండియాపై 27 శాతం టారిఫ్‌లను విధించిందని అన్నారు. భారత దిగుమతులపై 27 శాతం పరస్పర సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే ఈ చర్య అమెరికాకు భారత్ చేస్తున్న ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. అయితే పెరిగిన లెవీలను ఎదుర్కుంటున్న పోటీదారుల కంటే భారత్ మెరుగైన స్థానంలో ఉందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఉత్పత్తులపై విధించిన అధిక సుంకాలను ఎదుర్కోవడానికి ట్రంప్ తీసుకున్న చారిత్రాత్మక చర్య కారణంగా 60 దేశాలు పరస్పర సుంకాలను ఎదుర్కుంటున్నాయి. కాగా, అమెరికా సుంకాల ప్రభావాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు వాణిజ్య శాఖ తెలిపింది. ఈ అంశంపై దేశీయ పరిశ్రమ, ఎగుమతిదారుల అభిప్రాయాన్ని తెలుసుకుంటుంది. అమెరికా వాణిజ్య విధానంలోని ఈ కొత్త పరిణామం వల్ల మనకు లభించే కొత్త అవకాశాలను కూడా అధ్యయనం చేస్తున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే పరస్పర ప్రయోజనమైన, బహుల రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించడానికి ఇరు దేశాల మధ్య చర్చలుకొనసాగుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, 2027 నాటికి దేశాన్ని 30 నుంచి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.

Next Story