- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
US: చైనాతో యుద్ధంలో పాత్రపై దేశాల స్పష్టత కోరిన అమెరికా
జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయో స్పష్టం చేయాలని పెంటగాన్ వర్గాలు కోరినట్టు తెలుస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా, చైనా మధ్య ఎంతోకాలంగా వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అనేక సందర్భాల్లో ఇరు దేశాలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల విషయంలోనూ ఇతర దేశాల కంటే చైనాపైనే అత్యధిక సుంకం ప్రకటించారు. డ్రాగన్ కంట్రీ సైతం అంతే ధీటుగా అగ్రరాజ్యంపై సుంకాలను విధిస్తూ గట్టిగానే జవాబు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా చైనాపై తైవాన్ విషయంలో అమెరికా, చైనా యుద్ధానికి దిగితే జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయో స్పష్టం చేయాలని పెంటగాన్ వర్గాలు కోరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది. అమెరికా రక్షణ విధాన శాఖ అండర్-సెక్రటరీ ఎల్‌బ్రిడ్జ్ కోల్బీ ఇటీవల రెండు దేశాల రక్షణ అధికారులతో జరిగిన చర్చల సందర్భంగా ఈ విషయాన్ని ముందుకు తెచ్చారని, ఈ చర్చలతో సంబంధం ఉన్న వ్యక్తులు పేర్కొన్నారు. చరిత్రలో అమెరికా ఎన్నడూ తైవాన్‌కు రక్షణ ఇచ్చే హామీ ఇవ్వలేదు. దీంతో ఇటువంటి అభ్యర్థన రావడం పట్ల ఆయా దేశాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ, అమెరికా తైవాన్‌కు అత్యంత ముఖ్యమైన ఆయుధ సరఫరాదారు. తైవాన్‌పై హక్కులున్నాయని ఇప్పటికే పలు సందర్భాల్లో చైనా కొన్నిసార్లు సనికిక బలాన్ని ప్రయోగించింది. ఇతర మార్గాల్లోనూ ప్రయత్నాలు చేస్తోంది. దీన్ని తైవాన్ తిరస్కరిస్తోంది.
స్పందించిన ఆస్ట్రేలియా
అమెరికా అభ్యర్థనపై స్పందిస్తూ.. సమయం వచ్చినప్పుడు తమ పాత్రపై నిర్ణయం తీసుకుంటామని ఆస్ట్రేలియా వెల్లడించింది. ఆస్ట్రేలియా రక్షణ పరిశ్రమ మంత్రి పాట్ కాన్రాయ్ ఆ దేశ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌తో మాట్లాడుతూ .. ఆస్ట్రేలియన్ దళాలను అప్పగించాలనే నిర్ణయం అప్పటి ప్రభుత్వం తీసుకుంటుంది, ముందుగానే చెప్పడం కుదరదని అన్నారు. చైనా సైనిక మోహరింపూపై ఆస్ట్రేలియా ఆందోళన చెందుతోందని చెప్పారు.






