NYT: పహెల్గాం దాడిని మిలిటెంట్ దాడితో పోలిక.. న్యూయార్స్ టైమ్స్ కథనంపై అమెరికా సీరియస్.. టెర్రరిస్ట్-మిలిటెంట్ కు తేడా ఏంటి?

by Prasad Jukanti |

పహెల్గాం ఉగ్ర దాడి విషయంలో న్యూయార్క్ టైమ్స్ కథనంపై యూఎస్ సీరియస్ అయింది.

NYT: పహెల్గాం దాడిని మిలిటెంట్ దాడితో పోలిక.. న్యూయార్స్ టైమ్స్ కథనంపై అమెరికా సీరియస్.. టెర్రరిస్ట్-మిలిటెంట్ కు తేడా ఏంటి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూకశ్మీర్ పహెల్గాం లో (Pahelgam terror attack) పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని తప్పుగా రిపోర్టు చేసిన న్యూయార్క్ టైమ్స్ (New York Times) కథనానికి అమెరికా ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. లష్కరే తోయిబా కు అనుబంధంగా పని చేస్తున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్ర సంస్థ జరిపిన ఈ దాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కథనాన్ని వెలువరించిన ద న్యూయార్స్ టైమ్స్.. 'కశ్మీర్ లో మిలిటెంట్లు జరిపిన దాడిలో 24 మంది చనిపోయారు' అని పేర్కోంది. ఈ కథనంపై అమెరికా ప్రభుత్వానికి చెందిన విదేశాంగ కమిటీ (US House Panel) ఎక్స్ వేదికగా తప్పుపట్టింది. ఇది మిలిటెంట్ దాడి కాదని ఇది టెర్రరిస్ట్ ఎటాక్ అని పేర్కొంటూ న్యూయార్క్ టైమ్స్ రాసిన కథనాన్ని సరిచేసింది. మిలిటెంట్స్ అని రాసిన చోట రెడ్ మార్క్ తో కొట్టివేసి అక్కడ టెర్రరిస్ట్స్ అని సరిదిద్దింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షార్ట్ ను ఎక్స్ వేదికగా పోస్టు చేస్తూ 'హే.. న్యూయార్స్ టైమ్స్ మేము దీన్నీ మీకోసం సరిదిద్దాం. ఇది ఉగ్రవాదులు జరిపిన దాడి. ఉగ్రవాదం విషయానికి వస్తే న్యూయార్స్ టైమ్స్ వాస్తవాల నుంచి తొలగిపోతున్నది. అది భారత దేశంలో అయినా లేదా ఇజ్రాయెల్ లో అయినా అంటూ చీవాట్లు పెట్టింది.

మిలిటెంట్, టెర్రరిస్ట్ లకు తేడా ఏంటి?

విశ్లేషకులు చెబుతున్న ప్రకారం ఈ రెండు పదాల మధ్య వ్యత్యాసం ఉంది. హింసతో సమాజంలో భయం కలిగించి వ్యవస్థ సమగ్రత, సార్వభౌమత్వం, ఆర్థిక స్థితి తదితరరాలు దెబ్బతీసేది ఉగ్రవాదం (టెర్రరిజం). ఉగ్రవాదానికి భౌగోళికంగా ఇతర ప్రాంతాలతో సంబంధం ఉంటుంది. ఒక చోట హింసను చేపట్టి దాని ద్వారా జరిగే నష్టం వలన ఒక నిర్దిష్ట భౌగోళికంలో భయానక వాతావరణం సృష్టించడం. దీనికి రాజకీయ, మత, ప్రాంత తదితర కారణాలుంటాయి. మిలిటెంట్స్ విషయానికి వస్తే తమ రాజకీయ లేదా సామాజిక లక్ష్యాన్ని సాధించడానికి ఒక ప్రాంతం లోపల జరిగే సాయుధ తిరుగుబాటు. ఈ రెండూ హింస మార్గాలే, కానీ ఉద్దేశాలు వేరు.

ఏమిటీ హౌస్ కమిటీ ఆన్ ఫారిన్ అఫైర్స్?

యునైటెడ్ స్టేట్స్ హౌస్ కమిటీ ఆన్ ఫారిన్ అఫైర్స్. దీనిని హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ అని కూడా పిలుస్తారు. ఇది అమెరికా ప్రతినిధుల సభ యొక్క స్టాండింగ్ కమిటీ. ఇది యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ వ్యవహారాలకు సంబంధించిన బిల్లులు మరియు దర్యాప్తులపై అధికార పరిధిని కలిగి ఉంటుంది.

Next Story