- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
43 రోజుల ప్రభుత్వ షట్‌డౌన్‌కు తెర.. బిల్లును ఆమోదించిన US కాంగ్రెస్
అగ్రరాజ్యం అమెరికాలో 43 రోజుల తర్వాత ప్రభుత్వం షట్‌డౌన్‌కు తెరపడింది.

దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికా (America)లో 43 రోజుల తర్వాత ప్రభుత్వ షట్‌డౌన్ (Shut Down)కు తెరపడింది. ఈ మేరకు అక్కడి కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం షట్‌డౌన్ క్లోజ్ చేసే బిల్లును యూఎస్ కాంగ్రెస్ (US Congress) ఓటింగ్ ద్వారా ఆమోదించింది. అయితే, 222-209 ఓట్ల తేడాతో షట్‌డైన్ లిఫ్ట్ బిల్లు పాస్ అయింది. సదరు బిల్లును అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆమోదానికి సిఫారసు చేయగా ఆయన ఆ ఫైలుపై సంతకం పెట్టారు. కాగా, ప్రభుత్వం షట్‌డౌన్‌తో వారాల తరబడి ప్రభుత్వ సాయంపై ఆధారపడిన లక్షలాది అమెరికన్లకు ఆహార సహాయం నిలిచిపోయింది. వేతనాలు లేకుండా పని చేయడానికి సిద్ధంగా లేని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల కారణంగా విమాన రవాణా కుంటుపడింది. అయితే, తాజాగా షట్‌డౌన్ లిఫ్ట్ బిల్లుపై ప్రెసిడెంట్ ట్రంప్ సంతకంతో అన్ని సమస్యలు పరిష్కారం కానున్నాయని అన్ని వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా, ఆమోదం పొందబోయే బిల్లు ప్రభుత్వాన్ని జనవరి 30 వరకు మాత్రమే నడపడానికి నిధులు కల్పిస్తుందని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.






