Reciprocal Tariff: అధిక సుంకాలను భారత్ తగ్గించాలి: యూఎస్ వాణిజ్య కార్యదర్శి

by S Gopi |

అమెరికాతో ఉన్న ప్రత్యేక సంబంధాల గురించి పునరాలోచించాల్సిన సందర్భం వచ్చింది.

Reciprocal Tariff: అధిక సుంకాలను భారత్ తగ్గించాలి: యూఎస్ వాణిజ్య కార్యదర్శి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మరింత పటిష్టంగా కొనసాగేందుకు అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలను తగ్గించాలని యూఎస్ వాణిజ్య కార్యదర్శి హొవార్డ్ లుట్నిక్ తెలిపారు. శుక్రవారం జాతీయ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. భారత్ విధించే సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. అమెరికాతో ఉన్న ప్రత్యేక సంబంధాల గురించి పునరాలోచించాల్సిన సందర్భం వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక చర్చలపై దృష్టి సారించాలనుకుంటున్నాం. భారత్ అమలు చేస్తున్న అధిక సుంకాలను తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నాం, దానివల్ల కొన్ని రంగాలపై పడే భారాన్ని తప్పించవచ్చు. ముఖ్యంగా వ్యవసాయ లాంటి సున్నితమైన రంగాలకు ఎక్కువ లాభాలు ఉంటాయి. భారత్‌లోని చిన్న రైతుల ప్రయోజనాలను భారత్-యూఎస్ వాణిజ్య ఒప్పందం రక్షిస్తుంది. తద్వారా కొన్ని విభాగాల్లో, పరిమిత స్థాయిలోనైనా సానుకూల ప్రభావం ఉంటుంది. కాగా, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి భారత్‌పై పరస్పర/ప్రతీకార సుంకాలను అమలు చేస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో దేశీయంగా ఆటో పరిశ్రమ నుంచి వ్యవసాయం వరకు ఎగుమతిదారులు ఆందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో హొవార్డ్ లుట్నిక్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Next Story