మదురోపై అమెరికా రసాయనిక ఆయుధం?

by Muthe.Rajitha |

మదురోపై అమెరికా ప్రయోగించిన ఆ శక్తివంతమైన ఆయుధాలపై పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వివిధ కథనాలు ప్రచురిస్తున్నాయి.

మదురోపై అమెరికా రసాయనిక ఆయుధం?
X

దిశ, వెబ్ డెస్క్ : వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మదురోను అరెస్టు చేయడానికి అమెరికా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌ను ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్’గా పిలుస్తున్నారు. అయితే ఈ ఆపరేషన్ సమయంలో అమెరికా అత్యంత శక్తిమంతమైన, ఆధునిక ఆయుధాలను ఉపయోగించిందని మదురోకు సన్నిహితంగా పనిచేసిన ఒక భద్రతా సిబ్బంది వెల్లడించారు.

గార్డ్ వివరాల ప్రకారం.. అకస్మాత్తుగా వెనెజువెలా రాడార్ వ్యవస్థలు పూర్తిగా పనిచేయడం ఆగిపోయాయి. ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోపే డ్రోన్లు చుట్టుముట్టాయి. అమెరికా సైన్యం సాంకేతికంగా చాలా ముందుండటంతో వెనెజువెలా సైన్యం ఏమీ చేయలేకపోయిందని ఆయన అన్నారు. తీవ్రమైన సూపర్ సోనిక్ ధ్వని తరంగంలాంటి ఆయుధాన్ని ఉపయోగించారని, దాని ప్రభావంతో తల పగిలిపోతున్నట్లు అనిపించిందని, ముక్కుల నుంచి రక్తం రావడం, వాంతులు అయ్యాయని తెలిపారు.

కాగా అమెరికా సూపర్ సోనిక్ మైక్రోవేవ్‌లు, లేజర్లు వంటి అత్యంత ఆధునిక ఆయుధాలు వాడి ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మదురోపై అమెరికా ప్రయోగించిన ఆ శక్తివంతమైన ఆయుధాలపై పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వివిధ కథనాలు ప్రచురిస్తున్నాయి.

Next Story