యూఎస్‌లో ఉండే విదేశీయులకు వార్నింగ్.. పత్రాలు లేకుంటే కేసు!

by Phanindra |

యూఎస్‌లో ఉండే విదేశీయులకు వార్నింగ్ ఇచ్చిన సీబీపీ. గ్రీన్ కార్డున్నా సరే అవి దగ్గర లేకపోతే కేసు ఎదుర్కోవాల్సిందే!

యూఎస్‌లో ఉండే విదేశీయులకు వార్నింగ్.. పత్రాలు లేకుంటే కేసు!
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్‌లో ఉండే విదేశీయులకు అమెరికా ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. విదేశీయులు, గ్రీన్‌కార్డ్ హోల్డర్లు తమ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలను ఎప్పుడూ తమ వెంట ఉంచుకోవాలని, ఈ పత్రాలు లేకుండా అధికారులకు దొరికితే మిస్‌డిమీనర్ కేసు నమోదు చేస్తామని, జరిమానాలు కట్టాల్సి వస్తుందని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) హెచ్చరించింది.

యూఎస్ కోడ్‌ టైటిల్ 8లోని సెక్షన్ 1304(ఈ) ప్రకారం ఈ ఉత్తర్వులు జారీచేసిందీ సంస్థ. ‘18 ఏళ్లు నిండిన ప్రతి విదేశీ పౌరుడు.. యూఎస్‌లో ధ్రువపత్రాలు లేదా రిజిస్ట్రేషన్ రిసీట్ కార్డులు ఎప్పుడూ తమ వెంట ఉంచుకోవాలి. అలా చేయని పక్షంలో మిస్‌డిమీనర్ కేసు, ఫైన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు విదేశీయులైతే యూఎస్ చట్టాలను దయచేసి ఫాలో అవ్వండి’ అని సీబీపీ అడ్వైజరీ జారీచేసింది.

ఇటీవలి కాలంలో యూఎస్‌లో ఉంటున్న విదేశీయులపై ట్రంప్ సర్కారు ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇమిగ్రేషన్ చట్టాలను కఠినం చేస్తూ.. వీటిని అమలు చేయని విదేశీయులపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీబీపీ తాజా ఉత్తర్వులు కూడా జారీ అయినట్లు నిపుణులు భావిస్తున్నారు.

Next Story