ఆంత్రోపిక్‌కు షాకిచ్చిన అమెరికా.. ఫేబుల్‌ 5, మైథోస్ 5 యాక్సెస్‌ బంద్‌

by Thanuru Gopichand |

అంతర్జాతీయ కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న‌ది. ‘ఆంత్రోపిక్’ తీసుకొచ్చిన అత్యంత శక్తివంతమైన మోడల్స్ ‘క్లాడ్ ఫేబుల్ 5’, ‘మైథోస్ 5’లను భారతీయులతో పాటు విదేశీ పౌరులెవరూ వాడకుండా నిషేధిస్తూ వాషింగ్టన్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంత్రోపిక్‌కు షాకిచ్చిన అమెరికా.. ఫేబుల్‌ 5, మైథోస్ 5 యాక్సెస్‌ బంద్‌
X

దిశ, నేష‌న‌ల్ బ్యూరో: అంతర్జాతీయ కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న‌ది. ప్రముఖ ఏఐ సంస్థ ‘ఆంత్రోపిక్’ తీసుకొచ్చిన అత్యంత శక్తివంతమైన మోడల్స్ ‘క్లాడ్ ఫేబుల్ 5’, ‘మైథోస్ 5’లను భారతీయులతో పాటు విదేశీ పౌరులెవరూ వాడకుండా నిషేధిస్తూ వాషింగ్టన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మోడల్స్ లోని సైబర్ సెక్యూరిటీ రక్షణ కవచాలను ‘జైల్‌బ్రేక్’ (బైపాస్) చేయడం ద్వారా హ్యాకర్లు ప్రభుత్వాలు, బ్యాంకింగ్ వ్యవస్థలపై దాడులకు తెగబడే ప్రమాదముందని అమెరికా భద్రతా సంస్థలు హెచ్చరించాయి. ముఖ్యంగా ఈ ఏఐ మోడల్ ద్వారా సాఫ్ట్‌వేర్ లోపాలను రాబట్టవచ్చని అమెజాన్ పరిశోధకులు గుర్తించి నివేదించడంతో ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. అయితే ఇది కేవలం ఒక అపార్థమని, తాము అన్ని రకాల పరీక్షలు చేశామని ఆంత్రోపిక్ వాదిస్తున్నది. అయితే దేశీయ నిఘా, స్వయంప్రతిపత్తి ఆయుధాల తయారీకి తమ ఏఐని వాడబోమంటూ.. ట్రంప్ ప్రభుత్వంతో గతంలో వచ్చిన విభేదాలు, పెంటగాన్ పెట్టిన ‘సప్లై-చైన్ రిస్క్’ లేబుల్ వంటి పరిణామాల నేపథ్యంలో ఆంత్రోపిక్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు మోడల్స్‌ను అకస్మాత్తుగా నిలిపివేయక తప్పలేదు.

విదేశీ సాంకేతిక‌త‌పై ఆధారపడలేం..

ఇప్పటివరకు కేవలం ఏఐ చిప్‌లకే పరిమితమైన ఆంక్షలను మార్చేస్తూ, చరిత్రలో తొలిసారిగా ఒక సాఫ్ట్‌వేర్ యాక్సెస్‌నే బ్లాక్ చేయడంతో గ్లోబల్ ఏఐ రేసు సరికొత్త మలుపు తిరిగింది. దీనిపై జోహో అధినేత శ్రీధర్ వెంబు తీవ్రంగా స్పందిస్తూ.. గ్లోబలైజేషన్ అంతమైపోయింది అని, విదేశీ సాంకేతికతపై ఎల్లప్పుడూ ఆధారపడలేమని హెచ్చరించారు. ఏఐ అనేది కేవలం ఒక ప్రొడక్ట్ కాదని, దీన్ని సెమీకండక్టర్ల తరహాలోనే ప్రభుత్వాలు తమ వ్యూహాత్మక ఆయుధంగా మార్చుకుంటున్నాయని ఈ ఘర్షణ నిరూపిస్తున్న‌ద‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ డిజిటల్ యుద్ధంలో భారతదేశం వెనుకబడకుండా ఉండాలంటే, విదేశీ కంపెనీలపై ఆధారపడటం తగ్గించి, ఓపెన్-సోర్స్ మోడల్స్ సాయంతో తక్షణమే స్వదేశీ ఏఐ పరిశోధనలను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేయడం ఒక్కటే మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Next Story