- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
US Vs China : చైనాకు చెక్.. తైవాన్‌కు భారీగా అమెరికా ఆయుధాలు
దిశ, నేషనల్ బ్యూరో : చైనా(China)కు చెక్ పెట్టే మరో కీలక నిర్ణయాన్ని అమెరికా(US) తీసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో : చైనా(China)కు చెక్ పెట్టే మరో కీలక నిర్ణయాన్ని అమెరికా(US) తీసుకుంది. డ్రాగన్‌కు పొరుగునే ఉన్న తైవాన్(Taiwan)కు రూ.3,200 కోట్లు విలువైన ఎఫ్-16 యుద్ధ విమానాలు, రాడార్‌ల విడిభాగాలు, ఇతర సైనిక సామగ్రిని విక్రయిస్తామని అమెరికా ప్రకటించింది. మొబైల్ సబ్‌స్క్రైబ్ ఎక్విప్‌మెంట్‌ను మెరుగుపర్చేందుకు రూ.549 కోట్లను అదనంగా అందిస్తామని తెలిపింది. ఈ ప్రతిపాదనకు అమెరికా ప్రభుత్వం ఆమోదం లభించిందని వెల్లడించింది.
చైనా నుంచి తనను తాను రక్షించుకునేందుకు తైవాన్‌కు అన్ని రకాల సాయం అందిస్తామని పెంటగాన్(US Vs China) పేర్కొంది. ఈ విక్రయాలకు సంబంధించిన ఒప్పందాలు రాబోయే నెల రోజుల్లో పూర్తవుతాయని తైవాన్ రక్షణ శాఖ తెలిపింది. తైవాన్ తమ దేశంలో భాగమని చైనా వాదిస్తోంది. తరుచుగా తైవాన్ సరిహద్దుల్లో డ్రాగన్ సైనిక విన్యాసాలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో దీన్ని కీలక పరిణామంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.






