- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనా సుంకాలపై వెనక్కి తగ్గిన అమెరికా
by Phanindra |
చైనా సుంకాలపై అమెరికా వెనక్కు తగ్గింది. సుంకాలు పెంచకుండా 90 రోజులపాటు విరామం ఇస్తున్నట్లు యూఎష్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్, చైనా రెండు దేశాల టారిఫ్‌లపై సంధిని మరికొంత కాలం పొడిగించాలని నిర్ణయించుకున్నాయి. ఒకదానిపై మరొకటి ఈ రెండు దేశాలు భారీగా సుంకాలు విధించుకున్నాయి. అయితే ఆ తర్వాత ఇరుదేశాలు కొంత వెనక్కు తగ్గాయి. ఈ క్రమంలో మరో 90 రోజుల పాటు సుంకాలు పెంచుకోకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. నవంబరు 10 వరకు సుంకాలు పెంచకుండా నిలువరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. అమెరికా కంపెనీలపై సుంకాలు పెంచకూడదనే నిర్ణయాన్ని మరో 90 రోజులు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
Next Story






