- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
US alcohol: అమెరికన్ మద్యంపై భారత్ 150 శాతం సుంకం విధిస్తోంది.. వైట్ హౌజ్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్
అమెరికాపై వివిధ దేశాలు విధించిన సుంకాలపై వైట్ హౌస్ చర్చించగా అందులో భారత్ గురించి ప్రస్తావించింది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మరోసారి భారత్‌ను లక్ష్యంగా చేసుకుంది. అమెరికాపై వివిధ దేశాలు విధించిన సుంకాలపై వైట్ హౌస్ (White House) చర్చించగా అందులో భారత్ గురించి ప్రస్తావించింది. భారత్ అమెరికన్ మద్యంపై 150 శాతం, వ్యవసాయ ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు విధిస్తున్నట్టు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ (Karolin levit) తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిట్ ఫర్ టాట్ కు అనుకూలంగా ఉన్నారని, అన్ని దేశాలతో న్యాయమైన వాణిజ్యాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. కెనడా దశాబ్దాలుగా అమెరికాను, కష్టపడి పనిచేసే అమెరికన్లను దోపిడీ చేస్తోందని ఆరోపించారు. అమెరికన్ ప్రజలు, కార్మికులపై కెనడా విధించే సుంకాల రేట్లు అధికంగా ఉన్నాయన్నారు. కేవలం కెనడా మాత్రమే గాక అన్ని దేశాలూ అమెరికాపై ఎక్కువగానే సుంకాలు విధిస్తున్నాయని ఫైర్ అయ్యారు.
అమెరికా చీజ్, బటర్‌పై కెనడా 300 శాతం సుంకం వసూలు చేస్తోందని తెలిపారు. ఇక జపాన్ల రేటు 700శాతంగా ఉందన్నారు. ‘భారత్ అమెరికా వైన్ పై 150శాతం సుంకం విధిస్తోంది. ఇది కెంటుకీ బోర్బన్‌ను భారతదేశానికి ఎగుమతి చేయడానికి సహాయపడుతుందని మీరు అనుకుంటున్నారా? నేను అలా అనుకోను’ అని వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్ అన్యోన్యతను నమ్ముతారని, అమెరికన్ వ్యాపారాలు, కార్మికుల ప్రయోజనాలపై దృష్టి సారించే అధ్యక్షుడు ఉండటం అమెరికాకు గర్వకారణమని తెలిపారు. న్యాయమైన వాణిజ్యాన్ని ఆయన కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.






