- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా విమాన సేవల్లో కోత అమల్లోకి.. ఏకంగా 1,800 విమానాలు రద్దు
అమెరికా వ్యాప్తంగా నిత్యం బిజీబిజీగా ఉండే మొత్తం 40 ఎయిర్‌పోర్టులలో శుక్రవారం నుంచి 10 శాతం విమాన రాకపోకలను తగ్గించనున్నట్లుగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) వెల్లడిచింది.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా వ్యాప్తంగా నిత్యం బిజీబిజీగా ఉండే మొత్తం 40 ఎయిర్‌పోర్టులలో శుక్రవారం నుంచి 10 శాతం విమాన రాకపోకలను తగ్గించనున్నట్లుగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) వెల్లడిచింది. దీంతో ఏకంగా 1,800 విమాన సర్వీసులు రద్దు కానున్నాయి. ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లపై ఒత్తిడి పెరిగిపోతుండటంతో విమాన భద్రతను కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. కాగా, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో రోజుకు 44 వేలకు పైగా విమానాల (కమర్షియల్, కార్గో, ప్రైవేట్) రాకపోకలను కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం విమాన సేవల్లో కోత కారణంగా ప్రతిరోజూ వేలాది ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ సందర్భంగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటర్ బ్రయాన్ బెడ్‌ఫోర్డ్ (Bryan Bedford) మాట్లాడుతూ.. 35 ఏళ్ల విమానయాన జీవితంలో ఇలాంటి చర్య తాను ఎన్నడూ చూడలేదని అన్నాడు. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమైన షట్‌డౌన్ కారణంగా కంట్రోలర్లు జీతాలు లేకుండా పని చేస్తున్నారని తెలిపారు. ఆరు రోజుల పాటు వీక్లీ ఆఫ్స్ లేకుండా బలవంతంగా ఓవర్ టైమ్ డ్యూటీలతో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. చాలా మంది ఉద్యోగులు అనారోగ్యం కారణంగా లీవ్‌లోకి వెళ్తున్నారని, దీంతో విమానాశ్రయాల్లో ఫ్లైట్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని బెడ్‌ఫోర్డ్ అన్నారు.






