India, Canada Trade : భారత్‌-కెనడా మధ్య యురేనియం డీల్‌

by Ramesh Naini |

భారత ప్రధాని నరేంద్ర మోడీ, కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా యురేనియం సరఫరా డీల్ కుదిరింది.

India, Canada Trade : భారత్‌-కెనడా మధ్య యురేనియం డీల్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌, కెనడా దేశాల మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాల్లో కీలక అడుగు పడింది. సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 2.6 బిలియన్ డాలర్ల విలువైన భారీ యురేనియం సరఫరా డీల్ కుదిరింది. దేశంలో పౌర అణు ఇంధన కార్యక్రమానికి అవసరమైన ముడి పదార్థాల సరఫరాను నిరంతరాయంగా కొనసాగించడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. కేవలం ఇంధన సరఫరాకే పరిమితం కాకుండా.. చిన్న తరహా రియాక్టర్లు (Small Modular Reactors), అధునాతన రియాక్టర్ల సాంకేతికతపై కూడా ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నారు.

ఆర్థిక సంబంధాలు మరింత మెరుగు

ఆర్థిక సంబంధాలను మరింత మెరుగు పరుచుకోవడం లో భాగంగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) పై చర్చలను వేగవంతం చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. 2026 చివరి నాటికి ఈ ఒప్పందాన్ని కొలిక్కి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ స్పష్టం చేశారు. దీనివల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు భారీగా పెరిగే అవకాశం ఉంది.

వివేకానందుడిని స్మరించుకున్న మార్క్ కార్నీ

ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు భారత్‌లో ప్రధాని కార్నీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1893లో స్వామి వివేకానంద కెనడాలో పర్యటించిన చారిత్రక సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘లేవండి.. మేల్కొనండి.. లక్ష్యం చేరేవరకు ఆగకండి’ అన్న వివేకానంద సూక్తిని ప్రస్తావిస్తూ, భారత్-కెనడా సంబంధాల భవిష్యత్తుపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story